Share News

Traffic jam: ట్రాఫిక్‌లో చిక్కుకున్న గవర్నర్ సహా ముఖ్యులు

ABN , First Publish Date - 2023-12-07T13:17:16+05:30 IST

Telangana: మరికాసేపట్లో తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి, ఏఐసీసీ అగ్రనేతలు ఎల్బీస్టేడియంకు చేరుకున్నారు. ప్రమాణస్వీకారాణికి సమయం దగ్గరపడుతున్నప్పటికీ పలువురు ముఖ్యులు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు.

Traffic jam: ట్రాఫిక్‌లో చిక్కుకున్న గవర్నర్ సహా ముఖ్యులు

హైదరాబాద్: మరికాసేపట్లో తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి, ఏఐసీసీ అగ్రనేతలు ఎల్బీస్టేడియంకు చేరుకున్నారు. ప్రమాణస్వీకారానికి సమయం దగ్గరపడుతున్నప్పటికీ పలువురు ముఖ్యులు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. ముఖ్యంగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ట్రాఫిక్‌లో ఇరుక్కున్నారు. మల్లికార్జున్ కార్గేతో పాటు తుమ్మల నాగేశ్వరరావు, భట్టి విక్రమార్క ట్రాఫిక్‌లో ఉండిపోయారు. గవర్నర్ తమిళిసై కూడా ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. గవర్నర్ కాన్వాయ్ ఇంకా ట్రాఫిక్‌లోనే ఉండిపోయింది. ఒంటిగంటకు సభకు చేరుకోవాల్సిన గవర్నర్ ట్రాఫిక్ జామ్ వలన ఆలస్యమైంది. స్టేడియం వైపుకు గవర్నర్ కాన్వాయ్‌ను పోలీసులు ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే ట్రాఫిక్‌ను క్లియర్ చేయడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. అసెంబ్లీ నుంచి ఎల్బీస్టేడియం వరకు భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. అటు ప్రమాణ స్వీకారం చేయబోయే మంత్రులు కూడా ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. ప్రమాణ స్వీకారానికి సమయం దగ్గర పడటంతో నేతల్లో టెన్షన్ నెలకొంది. ట్రాఫిక్‌ను క్లియర్ చేయడంలో పోలీసులు వైఫల్యం చెందారు. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసు వైఫల్యాలపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు రెండు కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. చివరకు అందరినీ ఒకే వాహనంలో ఎల్బీస్టేడియానికి పోలీసులు పంపించి వేశారు.

Updated Date - 2023-12-07T13:19:56+05:30 IST