బీరు బాటిల్‌తో పొడిచి స్నేహితుడి హత్య

ABN , First Publish Date - 2023-04-03T00:45:16+05:30 IST

మద్యం మత్తులో బీరు బాటిల్‌ పగులగొట్టి స్నేహితుడిని హత్య చేసిన సంఘటన ఉప్పల్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో శనివారం రాత్రి జరిగింది.

బీరు బాటిల్‌తో పొడిచి స్నేహితుడి హత్య

మద్యం మత్తులో ఘాతుకం

ఉప్పల్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): మద్యం మత్తులో బీరు బాటిల్‌ పగులగొట్టి స్నేహితుడిని హత్య చేసిన సంఘటన ఉప్పల్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో శనివారం రాత్రి జరిగింది. ఉప్పల్‌ పోలీసులు తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి. కాచిగూడ రైల్వే స్టేషన్‌ సమీపంలోని ఇరానీ నగర్‌లో నివాసం ఉండే నాయర్‌ సురేఖ చిన్న కుమారుడు నాయర్‌ నిఖిల్‌(27) వృత్తి రీత్యా ఆటో డ్రైవర్‌. రామంతాపూర్‌ లో నివాసముంటున్న సిరాజ్‌(21) నిఖిల్‌కు మిత్రుడు. శనివారం రాత్రి ఇద్దరు ఉప్పల్‌ పారిశ్రామికవాడ లక్ష్మినారాయణ కాలనీలోని నిర్మానుష ప్రదేశంలో మద్యం తాగారు. ఈ సందర్భంగా ఇద్దరి మద్య డబ్బుల విషయంలో వాగ్వాదం చోటు చేసుకుంది. మాటామాటా పెరగడంతో సిరాజ్‌ తన వద్ద ఉన్న బీరు సీసాను పగులగొట్టి నిఖిల్‌ మెడపై పొడిచాడు. తీవ్రంగా గాయపడిన నిఖిల్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఆటో యజమాని మహబూబ్‌ సమాచారం మేరకు నిఖిల్‌ తల్లి సురేఖ ఉప్పల్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-04-03T00:45:16+05:30 IST