తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం

ABN , First Publish Date - 2023-06-07T03:59:54+05:30 IST

తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం వస్తుందని పార్టీ జాతీయ అధ్యక్షుడు, చంద్రబాబు ఆశాభావం ప్రకటించారు. ఏపీలో ఈసారి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణలో టీడీపీకి  పూర్వ వైభవం

ఏపీలో ఈసారి అధికారం ఖాయం

ఎన్నికల తర్వాత రెండు తెలుగు

రాషా్ట్రల్లో బలమైన శక్తిగా తెలుగుదేశం పార్టీ

తుదిశ్వాస దాకా తెలుగు వారికి రుణపడి ఉంటా

తెలంగాణ ఇప్పుడు నంబర్‌1గా ఉందంటే

అప్పట్లో టీడీపీ వేసిన పునాదే కారణం

తర్వాతి సీఎంలు నా విధానాల్ని కొనసాగించారు

ఏపీలో మాత్రం విధ్వంస పాలన: చంద్రబాబు

టీడీపీ అధ్యక్షుడిగా 14వ సారి ఎన్నికయ్యాక

తొలిసారి ఎన్టీఆర్‌ భవనకు.. ఘన స్వాగతం

ఏపీలో ఈసారి అధికారం ఖాయం: చంద్రబాబు

హైదరాబాద్‌, జూన 6 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం వస్తుందని పార్టీ జాతీయ అధ్యక్షుడు, చంద్రబాబు ఆశాభావం ప్రకటించారు. ఏపీలో ఈసారి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రెండు తెలుగు రాష్ర్టాల్లోనూ టీడీపీ బలమైన శక్తిగా ఉండబోతోందని పేర్కొన్నారు. రాజమండ్రి మహానాడులో పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత చంద్రబాబు మంగళవారం తొలిసారి ఎన్టీఆర్‌ భవనకు వచ్చారు. రాష్ట్ర పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు చంద్రబాబును ఘనంగా సత్కరించారు. తెలంగాణలో పార్టీ రాష్ట్ర నాయకత్వం బాగా పనిచేస్తోందని చంద్రబాబు ఈ సందర్భంగా కొనియాడారు. ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్లడం శుభపరిణామమన్నారు. ఎన్టీఆర్‌ శతజయంతిని 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో విజయవంతంగా నిర్వహించారని ప్రశంసించారు. తన తుది శ్వాస వరకు తెలుగు ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. దేశంలో తెలంగాణ నెంబర్‌ 1గా ఉందంటే, ఆనాడు టీడీపీ ప్రభుత్వం వేసిన పునాదే కారణమని పేర్కొన్నారు. అభివృద్ధి విధానాలను తన తర్వాతి సీఎంలు కొనసాగించారన్నారు. కానీ, ఏపీలో మాత్రం అభివృద్ధి విధ్వంసం జరుగుతోందని అన్నారు. టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ణానేశ్వర్‌ మాట్లాడుతూ.. చంద్రబాబు మళ్లీ ఏపీ సీఎం కావడం ఖాయమన్నారు. పార్టీ అధ్యక్షుడిగా 14వ సారి ఎన్నికైన తర్వాత తొలిసారిగా ఎన్టీఆర్‌భవనకు వచ్చిన సందర్భంగా చంద్రబాబుకు పార్టీ నాయకులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. పెద్దఎత్తున బాణసంచా కాల్చారు. కాసాని జ్ఞానేశ్వర్‌, పలువురు సీనియర్‌ నాయకులు చంద్రబాబును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఏపీలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయడం ఖాయమని తేల్చిచెప్పారు. ఏపీలో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఎన్నికలు రావాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారన్నారు.

Updated Date - 2023-06-07T03:59:54+05:30 IST