Hyderabad: పంజాగుట్ట ఎర్రమంజిల్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం
ABN , Publish Date - Dec 22 , 2023 | 08:54 AM
పంజాగుట్ట ఎర్రమంజిల్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పంజాగుట్టలోని నాలుగో అంతస్తులో మంటలు ఎగిసిపడుతున్నాయి. అందులో నివసిస్తున్న కొంతమంది ప్రాణభయంతో బయటికి వచ్చి ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
హైదరాబాద్: పంజాగుట్ట ఎర్రమంజిల్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పంజాగుట్టలోని నాలుగో అంతస్తులో మంటలు ఎగిసిపడుతున్నాయి. అందులో నివసిస్తున్న కొంతమంది ప్రాణభయంతో బయటికి వచ్చి ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులో తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమా? లేదా గ్యాస్ సిలిండర్ లీక్ కారణమా? అనేది తెలియాల్సి ఉంది.