జూన్ 9న చేపప్రసాదం పంపిణీ
ABN , First Publish Date - 2023-05-24T05:04:15+05:30 IST
కరోనా మహమ్మారి వల్ల హైదరాబాద్‌లో మూడేళ్లుగా నిలిచిపోయిన చేపప్రసాదం పంపిణీ కార్యక్రమం పునఃప్రారంభం కానుంది. ఎప్పట్లాగే నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వేదికగా జూన్ 9న చేపప్రసాదం పంపిణీ జరగనుంది.
హైదరాబాద్ సిటీ, మే 23 (ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారి వల్ల హైదరాబాద్‌లో మూడేళ్లుగా నిలిచిపోయిన చేపప్రసాదం పంపిణీ కార్యక్రమం పునఃప్రారంభం కానుంది. ఎప్పట్లాగే నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వేదికగా జూన్ 9న చేపప్రసాదం పంపిణీ జరగనుంది. ఆ రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి 24 గంటలపాటు నిరంతరాయంగా చేపప్రసాదాన్ని ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు బత్తిన సోదరులు గౌరీ శంకర్‌గౌడ్, శివశంకరగౌడ్, అమర్నాథ్ గౌడ్‌లు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో మంగళవారం సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ జూన్ 9న నిర్వహించ తలపెట్టిన కార్యక్రమానికి ప్రభుత్వం అనుమతినిచ్చిందని, అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తుందని చెప్పారు.