వెంటనే పీఆర్సీని ప్రకటించండి
ABN , First Publish Date - 2023-01-02T04:37:26+05:30 IST
ఈ ఏడాది జూన్ 30తో కాలపరిమితి ముగియనున్న నేపథ్యంలో వెంటనే పీఆర్సీని ప్రకటించాలని సీఎం కేసీఆర్‌ను టీపీసీసీ నేత గాల్‌రెడ్డి హర్షవర్థన్‌రెడ్డి కోరారు.
కేసీఆర్‌కు టీపీసీసీ నేత గాల్‌రెడ్డి లేఖ
రైతుల రాబంధు సమితి అధ్యక్షుడు పల్లా: అన్వేష్ రెడ్డి
హైదరాబాద్, జనవరి 1(ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది జూన్ 30తో కాలపరిమితి ముగియనున్న నేపథ్యంలో వెంటనే పీఆర్సీని ప్రకటించాలని సీఎం కేసీఆర్‌ను టీపీసీసీ నేత గాల్‌రెడ్డి హర్షవర్థన్‌రెడ్డి కోరారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు ఆదివారం ఆయన బహిరంగ లేఖ రాశారు. గత పీఆర్సీలో ఉద్యోగులు 33 నెలల ఫిట్‌మెంట్ నష్టపోయారని, ఒక్కో ఉద్యోగికి రూ. 8 లక్షల నుంచి రూ. 18 లక్షల వరకు నష్టం జరిగిందని పేర్కొన్నారు. ఇలాంటి నష్టం జరగకుండా ఇప్పటికైనా త్వరితగతిన పీఆర్సీ ప్రకటించాలని కోరారు. రైతు స్వరాజ్య వేదికపైన రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి చేసిన అహంకార పూరిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వే్‌షరెడ్డి నేడొక ప్రకటనలో తెలిపారు. పల్లా.. రైతు బంధు సమితి అధ్యక్షుడు కాదని, రైతుల రాబంధు సమితి అధ్యక్షుడని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పంట నష్టమే జరగలేదంటూ రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతున్నారని, అదే నిజమైతే ఫబ్రవరి, 2022లో మంత్రులు వరంగల్ జిల్లాకు విహార యాత్రకోసం వెళ్లారా? అని ప్రశ్నించారు. పంట నష్టం కారణంగా ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలని చూపిస్తామని, రాజేశ్వర్‌రెడ్డికి వచ్చే దమ్ముందా? అని సవాల్ విసిరారు.