Hyderabad: సికింద్రాబాద్‌లో డెక్కన్ మాల్ అగ్ని ప్రమాద ఘటన.. భవన యజమానిపై కేసు..

ABN , First Publish Date - 2023-01-20T10:39:38+05:30 IST

హైదరాబాద్: సికింద్రాబాద్ రాంగోపాల్ పేట్ పీఎస్ పరిధిలోని నిన్న నల్లగుట్ట వద్ద డెక్కన్ నైట్ వేర్ స్పోర్ట్స్ దుకాణంలో జరిగిన అగ్ని ప్రమాదం (Fire Accident)పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Hyderabad: సికింద్రాబాద్‌లో డెక్కన్ మాల్ అగ్ని ప్రమాద ఘటన.. భవన యజమానిపై కేసు..

హైదరాబాద్: సికింద్రాబాద్ రాంగోపాల్ పేట్ పీఎస్ పరిధిలోని నిన్న నల్లగుట్ట వద్ద డెక్కన్ నైట్ వేర్ స్పోర్ట్స్ దుకాణంలో జరిగిన అగ్ని ప్రమాదం (Fire Accident)పై పోలీసులు కేసు నమోదు చేశారు. కానిస్టేబుల్ బలప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నలుగురిని రిస్క్యూ చేసినట్లు ఎఫ్ఐఆర్‌ (FIR)లో పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనలో మరో ముగ్గురు.. వసీం, జునైద్, జహీర్ మిస్సింగ్ అయ్యారు. నల్లటి దట్టమైన పొగ, ఎగిసిపడుతున్న మంటలతో ముగ్గురినీ గుర్తించలేకపోయామని పోలీసులు పేర్కొన్నారు. ప్రమాదానికి భవన యజమాని మహమ్మద్ ఓవైసీ, ఎంఏ రహీంలు కారణమని గుర్తించి.. వాళ్ళపై కేసు నమోదు చేశారు. భవనానికి సెట్ బ్యాక్ (Set Back) లేకపోవడం, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు గుర్తించారు. మిస్సింగ్ అయిన ముగ్గురూ బీహార్‌కు చెందిన వాళ్లుగా గుర్తించారు.

వసీమ్, జహీర్‌ నల్లగుట్టలో నివసిస్తుండగా.. జునైద్‌ డెక్కన్ మాల్‌లో మూడో అంతస్తులో ఉంటున్నారు. కాగా అగ్నిప్రమాద ఘటనలో ముగ్గురు సజీవదహనం? అయినట్లు సమాచారం. బీహార్‌కు చెందిన ముగ్గురు కూలీలుగా గుర్తించారు. ముగ్గురి మృతదేహాలు కాలి బూడిద అయినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ముగ్గురు అచూకీ తెలియకపోవడంతో వారి కుటుంబాల్లో ఆందోళన నెలకొంది.

కాగా అగ్ని ప్రమాదం జరిగిన భవనం అక్రమ నిర్మాణం అని తెలుస్తోంది. అధికార పార్టీ ప్రజాప్రతినిధి బంధువు ఒకరు దాన్ని నిర్మించినట్లు స్థానికులు చెబుతున్నారు. 2014 వరకు ఈ భవనంలో సెట్‌బ్యాకులు లేకుండా.. రెండు సెల్లార్లు, గ్రౌండ్‌ఫ్లోర్‌, మరో మూడంతస్తులు ఉండగా.. ఆ ప్రజాప్రతినిధి బంధువు జోక్యంతో మరో రెండు అంతస్తులను అదనంగా నిర్మించినట్లు తెలిసింది. అధికారపార్టీ నేత కావడంతో.. జీహెచ్‌ఎంసీ అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదనే విమర్శలున్నాయి. నిజానికి సెల్లార్లు లేకుండా.. జీ+3 అంతస్తులకు నివాస కేటగిరీలో 2006లో ఆ భవనానికి అనుమతులు తీసుకున్నట్లు తెలుస్తోంది. కానీ, పూర్తిగా వాణిజ్య అవసరాలకు ఆ భవనాన్ని వాడుతున్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత భవన క్రమబద్ధీకరణ పథకం (బీఆర్‌ఎస్)కు దరఖాస్తు చేశారని, 2016లో ఆ భవనాన్ని ప్రస్తుత రహీంఖాన్‌కు విక్రయించారని స్థానికులు చెబుతున్నారు. ఆ తర్వాత ఆయన ఒక సెల్లార్‌, 2, 3 అంతస్తులను ఇతరులకు విక్రయించారంటున్నారు.

Updated Date - 2023-01-20T10:39:42+05:30 IST