దళిత బంధు పథకం దేశానికే ఆదర్శం
ABN , First Publish Date - 2023-02-13T00:09:03+05:30 IST
దళిత బంధు పథకం దేశానికే ఆదర్శమని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. దళితుల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరమూ కృషి చేస్తున్నారన్నారు.
ఎమ్మెల్యే ముఠా గోపాల్
చిక్కడపల్లి, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): దళిత బంధు పథకం దేశానికే ఆదర్శమని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. దళితుల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరమూ కృషి చేస్తున్నారన్నారు. గాంధీనగర్ డివిజన్‌కు చెందిన బత్తుల కిరణ్‌కు దళిత బంధు పథకం కింద మంజూరైన కారును ఆదివారం ఎమ్మెల్యే ముఠా గోపాల్, బీఆర్‌ఎస్ యువజన విభాగం నాయకుడు ముఠా జైసింహతో కలిసి ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ప్రభుత్వం దళిత బంధు పథకం అమలు చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దళితుల సంక్షేమానికి పెద్దపీట వేసి బడ్జెట్‌లో దళిత బంధు పథకానికి 17,700 కోట్లను కేటాయించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ డివిజన్ అధ్యక్షుడు ఎం.రాకేశ్‌కుమార్, మాజీ కార్పొరేటర్ ముఠా పద్మనరేష్, నాయకులు ఎర్రం శ్రీనివా్‌సగుప్తా, గుండు జగదీశ్‌బాబు, మారిశెట్టి నర్సింగ్‌రావు, రవిశంకర్‌గుప్తా, పున్న సత్యనారాయణ, పీఎస్ శ్రీనివాస్, రాజ్‌కుమార్, హనుమంతు, జహంగీర్, వెంకటేశ్, చందు, సురేష్, ఎంబీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.