లీకేజీపై ఉద్యమాల సమన్వయానికి కాంగ్రెస్‌ కమిటీ

ABN , First Publish Date - 2023-03-31T03:31:03+05:30 IST

టీఎ్‌సపీఎస్సీ పేపర్‌ లీకేజీ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమాలను సమన్వయం చేసేందుకు ఏర్పాటు .....

లీకేజీపై ఉద్యమాల సమన్వయానికి కాంగ్రెస్‌ కమిటీ

హైదరాబాద్‌, మార్చి30(ఆంధ్రజ్యోతి): టీఎ్‌సపీఎస్సీ పేపర్‌ లీకేజీ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమాలను సమన్వయం చేసేందుకు ఏర్పాటు చేసిన కమిటీ చైర్మన్‌గా రాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ మల్లు రవి నియమితులయ్యారు. పేపర్‌ లీకేజీతో నష్టపోయిన విద్యార్ధులు, నిరుద్యోగులతో, తదితర రాజకీయ వర్గాలతో సంప్రదింపులు జరిపి ఉద్యమాన్ని విజయవంతం చేసేందుకు టీపీసీసీ తరఫున ఏర్పాటైన ఆ కమిటీ కన్వీనర్‌లుగా రాష్ట్ర యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు కె.శివసేనారెడ్డి, ఎన్‌ఎ్‌సయూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌, సభ్యులుగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు కె.మానవతారాయ్‌, ఆర్‌.బాలలక్ష్మి, పవన్‌మల్లాదిలను నియమించినట్టు టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బి.మహే్‌షకుమార్‌ గౌడ్‌ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.

Updated Date - 2023-03-31T03:31:03+05:30 IST