ఐటీ శాఖకు కంప్యూటర్‌ సొసైటీ అవార్డు

ABN , First Publish Date - 2023-03-26T02:32:58+05:30 IST

ఎమర్జింగ్‌ టెక్నాలజీ వినియోగంలో వినూత్న ఆలోచనలు అమలుచేస్తున్నందుకు గానూ ఐటీ శాఖకు కంప్యూటర్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా(సీఎ్‌సఐ) పురస్కారం దక్కింది.

ఐటీ శాఖకు కంప్యూటర్‌ సొసైటీ అవార్డు

హైదరాబాద్‌, మార్చి 25(ఆంధ్రజ్యోతి): ఎమర్జింగ్‌ టెక్నాలజీ వినియోగంలో వినూత్న ఆలోచనలు అమలుచేస్తున్నందుకు గానూ ఐటీ శాఖకు కంప్యూటర్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా(సీఎ్‌సఐ) పురస్కారం దక్కింది. ఈ-గవర్నెన్స్‌ విభాగంలో బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ సహాయంతో ఐటీ శాఖ రిజిస్ట్రేషన్‌ శాఖలో అమలుచేస్తున్న టీ-చిట్స్‌కు ఈ అవార్డు రాగా... ఈ-ప్రొక్యూర్‌మెంట్‌ సేవలకు కూడా ప్రత్యేక అవార్డు లభించింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఐటీ శాఖ సంయుక్త కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్‌, ఉపాధి టెక్నో సర్వీసెస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌.కళ్యాణ్‌ చక్రవర్తిరెడ్డి ఈ పురస్కారాలను అందుకున్నారు. ఐటీ శాఖకు సీఎ్‌సఐ పురస్కారం రావడంపై ఆ శాఖ మంత్రి కేటీఆర్‌, ఐటీ కార్యదర్శి జయేష్‌ రంజన్‌ హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-03-26T02:32:58+05:30 IST