చిన జీయర్ స్వామీజీ చేతుల మీదుగా ఆలయ్ రోలింగ్ మెడోస్ ప్రారంభం

ABN , First Publish Date - 2023-02-27T23:23:55+05:30 IST

ఆలయ్ ఇన్ఫ్రా ఆధ్వర్యంలో శంషాబాద్‌లో ప్రపంచ స్థాయి వసతులతో కూడిన రోలింగ్ మెడోస్.. ప్రపంచస్థాయి లగ్జరీ విల్లాస్ గ్రేటెడ్ కమ్యూనిటీని

చిన జీయర్ స్వామీజీ చేతుల మీదుగా ఆలయ్ రోలింగ్ మెడోస్ ప్రారంభం

హైదరాబాద్: ఆలయ్ ఇన్ఫ్రా ఆధ్వర్యంలో శంషాబాద్‌లో ప్రపంచ స్థాయి వసతులతో కూడిన రోలింగ్ మెడోస్.. ప్రపంచస్థాయి లగ్జరీ విల్లాస్ గ్రేటెడ్ కమ్యూనిటీని ప్రారంభించారు. తుక్కుగుడా, మజీద్ గడ్డ రిజర్వ్ ఫారెస్ట్ సమీపంలో ఈ వెంచర్ను ఏర్పాటు చేశారు. ఆలయ్ ఇన్ఫ్రా మేనేజింగ్ పార్ట్నర్ నిరూప రెడ్డి ఆధ్వర్యంలో ఈ విలాసవంతమైన ప్రాజెక్ట్ తీర్చిదిద్దన్నారు. ఈ ప్రాజెక్టును ప్రముఖ గురువులు హెచ్ హెచ్ చిన జీయర్ స్వామీజీ చేతుల మీదుగా రీసెంట్‌గా ప్రారంభించారు. పచ్చదనంతో ఉన్న 37.6 ఎకరాలలో మొత్తం 122 విల్లాలు నిర్మించనున్నారు.

swamy-pic.jpg

ఇటాలియన్ మార్బుల్‌తో ఫ్లోరింగ్ మరియు టాయిలెట్లు, నోకెన్ సానిటరీ, ల్యుట్రాన్ ఎలక్ట్రికల్ ఆటోమేషన్, సెక్యూరిటీ కోసం బయోమెట్రిక్ విధానాన్ని ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. రెండు ఎకరాలలో సెంట్రల్ పార్క్, ఆర్గానిక్ గార్డెన్ 50% ఓపెన్ స్పేస్ తో పాటు ఔట్ డోర్ స్పోర్ట్స్, వాకింగ్ కి మరియు సైక్లింగ్‌కు అనుగుణంగా ట్రాక్‌తో పాటు ఇంకా అనేక వసతులను ఏర్పాటు చేయనున్నారు. నిరూప్ రెడ్డి విషయానికి వస్తే.. భారతదేశపు టాప్ 30 ఆర్కిటెక్ట్‌ల ఫోర్బ్స్ ఇండియా ‘ది బోల్డ్ క్లబ్’లో నిరూప్ రెడ్డికి స్థానం లభించింది. ఈ గుర్తింపు ఒక ప్రొఫెషనల్ ఆర్కిటెక్ట్‌గా తనపై ఉన్నతమైన బాధ్యతను కలిగిస్తుందని ఆయన అంటున్నారు.

Updated Date - 2023-02-27T23:23:56+05:30 IST