నుమాయిష్‌లో ఆటిజం పిల్లలు

ABN , First Publish Date - 2023-01-25T00:48:19+05:30 IST

శామీర్‌పేటకు చెందిన ఆటీజం ఆఽఽశ్రమంలో ఆశ్రయం పొందుతున్న న 60 మంది బాధితులు మంగళవారం నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లోని నుయాయి్‌షను సందర్శించారు.

నుమాయిష్‌లో ఆటిజం పిల్లలు

ఆఫ్జల్‌గంజ్‌, జనవరి 24(ఆంధ్రజ్యోతి): శామీర్‌పేటకు చెందిన ఆటీజం ఆఽఽశ్రమంలో ఆశ్రయం పొందుతున్న న 60 మంది బాధితులు మంగళవారం నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లోని నుయాయి్‌షను సందర్శించారు. ఆశ్రమం వ్యవస్థాపక ట్రస్టీ అనిల్‌ కుంద్రా.. ఆటిజం వ్యాధితో (వేరే లోకంలో ఉంటారు) బాధపడుతున్న 60 మంది పిల్లలకు ఆశ్రయం కల్పిస్తున్నారు. ఎగ్జిబిషన్‌ సొసైటీ ఉపాధ్యక్షులు అశ్వినిమార్గం, పి.హరినాథ్‌ రెడ్డి వీరేందర్‌, సుఖే్‌షరెడ్డి ఆహ్వానం మేరకు పిల్లలను సాయంత్రం ప్రత్యేక బస్సులో తీసుకొచ్చి సుమారు 2 గంటల పాటు నుమాయి్‌షను చూపించారు. అనంతరం పిల్లను చుక్‌ చుక్‌ రైళ్లో కూర్చోబెట్టి తిప్పారు. అనంతరం వారికి అల్పాహారం అందజేశా రు. ఈ సందర్భంగా అనిల్‌కుంద్రా మాట్లాడుతూ.. పుట్టుకతో వచ్చే ఆటిజం వ్యాధితో పిల్లలు మన లోకంలో ఉండరని, వారిదంతా వేరే ప్రపంచం అన్నారు. వారు ఏ సమయంలో ఏం చేస్తారో వారికే తెలియదన్నారు. అలాంటి పిల్లలను పది సంవత్సరాలుగా ఆశ్రమంలో ఉంచి వారి బాగోగులు చూస్తూ వైద్యం బాగు చేయిస్తున్నామన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్‌ సొసైటీ ఆహ్వానం మేరకు వారికి నుమాయిష్‌ చూపించడం ఆనందంగా ఉందన్నారు.

ఆకట్టుకునే ఆర్‌ అండ్‌ బీ స్టాల్‌

తెలంగాణలో అన్ని ప్రభుత్వ భవనాలు, ఆస్పత్రులు, పోలీ్‌సస్టేషన్లను ఆధునికీకరించే దిశగా రూపొందిస్తున్నామని రాష్ట్ర ఆర్‌ అండ్‌ బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం రాత్రి నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో కొనసాగుతున్న నుమాయి్‌షలో ఆర్‌ అండ్‌ బీ స్టాల్‌ను సెక్రటరీ ఆశ్విని మార్గం, గణపతి రాయ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఆధునాతన హంగులతో నిర్మితమవుతున్న సెక్రటేరియట్‌ను ఫిబ్రవరి 17న లాంఛనంగా ప్రారంభంకానుందని ఆయన చెప్పారు. ఈ స్టాల్‌లో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అన్ని కార్యాలయాల అభివృద్ధి నమునాలను సందర్శన కోసం డెమోలను ఏర్పా టు చేశామన్నారు. ఈ స్టాల్‌ను సందర్శకులు తిలకించాలన్నారు.

Updated Date - 2023-01-25T00:48:19+05:30 IST