‘గురుకుల’ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు ఓటీఆర్, దరఖాస్తుకు వేర్వేరు సర్వర్లు
ABN , First Publish Date - 2023-04-21T03:53:39+05:30 IST
గురుకుల పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు సాఫ్ట్‌వేర్ సమస్య కారణంగా అభ్యర్థులు పడుతున్న ఇబ్బందులపై ‘బేజారు గురూ!’ శీర్షికన ఆంధ్రజ్యోతిలో గురువారం ప్రచురితమైన వార్తాకథనానికి బోర్డు స్పందించింది.
రద్దీ మేర సాఫ్ట్‌వేర్ కెపాసిటీ పెంపు
హైదరాబాద్, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): గురుకుల పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు సాఫ్ట్‌వేర్ సమస్య కారణంగా అభ్యర్థులు పడుతున్న ఇబ్బందులపై ‘బేజారు గురూ!’ శీర్షికన ఆంధ్రజ్యోతిలో గురువారం ప్రచురితమైన వార్తాకథనానికి బోర్డు స్పందించింది. పోస్టుల భర్తీ కోసం గురుకుల బోర్డు తీసుకొచ్చిన సాఫ్ట్‌వేర్‌లో పలు సవరణలు చేసింది. నోటిఫికేషన్ విడుదలైన ఏప్రిల్ 17 నుంచి వన్ టైం రిజిస్ట్రేషన్, దరఖాస్తుల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడం, ఓటీఆర్‌ల రిజిస్ట్రేషన్‌లలోనూ ఇబ్బందులు ఎదురవడంతో అభ్యర్ధుల్లో గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సాంకేతిక సమస్యలను పరిగణనలోకి తీసుకున్న ట్రిబ్ ( బుధవారం వరకు ఓటీఆర్, దరఖాస్తుకు ఉన్న ఒకే సర్వర్‌ను మారుస్తూ వన్ టైం రిజిస్ట్రేషన్‌కు, దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా వేర్వేరుగా రెండు సర్వర్‌లను ప్రవేశపెట్టింది. తాజా మార్పులతో ఓటీఆర్, దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు సాంకేతిక సమస్య తగ్గుతుందని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. దీంతోపాటు రద్దీని తట్టుకునేలా సాఫ్ట్‌వేర్ కెపాసిటీని కూడా పెంచారు. ఇదిలా ఉండగా ఇప్పటివరకు మొత్తం 20,400 ఓటీఆర్‌లు నమోదు కాగా, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ పోస్టులకు కలిపి మొత్తం 1,350 దరఖాస్తులు వచ్చాయి.