పగులుతున్న రమేశ పాపాల పుట్ట
ABN , First Publish Date - 2023-06-07T04:34:43+05:30 IST
టీఎ్‌సపీఎస్సీ పరీక్షల్లో హైటెక్ మాస్ కాపీయింగ్ దందాకు పాల్పడిన రమేశ పాపాల పుట్ట పగిలింది. అతడు పాత నేరగాడేనన్న విషయం సిట్ దర్యాప్తులో బయటపడింది.
మాస్ కాపీయింగ్‌కు పాల్పడ్డ కేటుగాడి పాత నేరాలను బయటకు తీస్తున్న సిట్
2015లో ప్రియురాలిని చంపి.. జైలుకు
45 రోజులు జైల్లోనే.. ఏఈగా సస్పెండ్
2018లో ఉద్యోగం మానేసి కాపీ దందా
హైదరాబాద్ సిటీ, జూన 6(ఆంధ్రజ్యోతి): టీఎ్‌సపీఎస్సీ పరీక్షల్లో హైటెక్ మాస్ కాపీయింగ్ దందాకు పాల్పడిన రమేశ పాపాల పుట్ట పగిలింది. అతడు పాత నేరగాడేనన్న విషయం సిట్ దర్యాప్తులో బయటపడింది. అతడి పాత నేరాల చిట్టా వెలుగులోకి వచ్చింది. ఏపీలోని అన్నమయ్య జిల్లా కొత్తకోట మండలం భీరంగికి చెందిన రమేశ.. బీటెక్ పూర్తి చేసి, 2011లో ఇరిగేషన డిపార్టుమెంట్‌లో ఏఈగా ఉద్యోగం సంపాదించాడు. వరంగల్‌కు చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఆమె వరంగల్ వాటర్ వర్క్స్‌లో ఉద్యోగం చేస్తోంది. వారికి ఇద్దరు పిల్లలు. పెళ్లయిన తర్వాత కూడా.. అన్నమయ్య జిల్లా కొత్తకోట మండలానికి చెందిన ఒక యువతితో కొంతకాలం ఎంజాయ్ చేశాడు. ఆ తర్వాత ఆమెతో మనస్పర్థలు రావడంతో.. ఒకరోజు కోపంలో ఆమెను కొట్టి చంపేశాడు. 2015 డిసెంబరులో జరిగిన ఈ ఘటనకు సంబంధించి.. కొత్తకోట పోలీ్‌సస్టేషనలో అతడిపై హత్య కేసు నమోదైంది. ఆ కేసులో అతడు జైలుకూ వెళ్లాడు. దీంతో రమేశను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. 45 రోజులపాటు జైల్లో ఉన్న రమేశ ఆ తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చాడు. కొద్దిరోజులు సొంతూరిలో వ్యవసాయం చేశాడు. 2018లో సస్పెన్షన ఎత్తేయడంతో తిరిగి ఉద్యోగంలో చేరాడు. అయితే అతనికి ఉద్యోగం చేయడం నచ్చలేదు. చేరిన 8 నెలల తర్వాత ఉద్యోగం మానేసినట్లు విచారణలో తేలింది. ప్రియురాలి హత్య కేసులో త్వరలోనే అతడు దోషిగా తేలే అవకాశం ఉన్నట్లు సమాచారం.
సీన రీ కనస్ట్రక్షన..
రమేశను కస్టడీకి తీసుకొని విచారిస్తున్న సిట్ ఉన్నతాధికారులు మంగళవారం హైటెక్ మాస్ కాపీయింగ్‌కు సంబంధించిన సీన రీ కనస్ట్రక్షన చేశారు. ఈ వ్యవహారంలో అతడు ఎలాంటి ఎలకా్ట్రనిక్ డివైజ్ లు వాడాడు? వాటిని ఎక్కడ కొన్నాడు? ఎంతమంది అనుచరులను పెట్టుకున్నాడు? మలక్‌పేటలో కంట్రో ల్ సెంటర్ ఎక్కడ ఏర్పాటు చేశాడు? పరీక్ష రాసే అభ్యర్థులకు డివైజ్‌ను ఎలా అమర్చాడు? ఎగ్జామినేషన సెంటర్ చెకింగ్‌లో మెటల్ డిటెక్టర్‌కు దొరక్కుండా ఉండటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాడు? తదితర వివరాలను సీన రీకనస్ట్రక్షన ద్వారా అధికారులు తెలుసుకున్నారు. కాగా.. ఈ వ్యవహారంలో అతడికి సహకరించిన ప్రిన్సిపాల్ పేరు ఆలీగా ప్రచారం జరిగింది. కానీ, ఆ ప్రిన్సిపాల్ పేరు మహమ్మద్ పాషాగా అధికారులు గుర్తించారు. పరీక్ష ప్రారంభం అయిన తర్వాత ప్రశ్నపత్రాన్ని వాట్సాప్ చేయడానికి మహ మ్మద్ పాషాతో రమేశ రూ.8 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అలా ప్రశ్నపత్రాలు తెప్పించుకుని, తన కంట్రోల్ సెంటర్ నుంచి అభ్యర్థులకు సమాధాలు చెప్పాడు. అతడి సాయంతో ఏడుగురు అభ్యర్థులు కాపీయింగ్‌కు పాల్పడినట్లు సిట్ అధికారులు గుర్తించారు. వారితో పాటు.. మరో 30 మందికి ఏఈ ప్రశ్నపత్రాలను విక్రయించిన రమేశ.. మొత్తంగా రూ.2 కోట్లు కొల్లగొట్టినట్లు అధికారులు గుర్తించారు.
ఉద్యోగం మానేశాక..
గత ఐదేళ్లుగా ఉద్యోగం లేకుండా రమేశ ఎలా గడుపుతున్నాడా? అనే విషయంపై సిట్ అధికారు లు ఆరా తీయగా.. వ్యవసాయం చేయడంతో పాటు, హైటెక్ మాస్‌కాపీయింగ్‌కు పాల్పడి డబ్బులు సం పాదిస్తున్నట్లు తెలిసింది. రమేశకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలపై మంచి పట్టు ఉంది. దాన్ని అతడు మంచికి కాక చెడుకు వినియోగించేవాడని.. హైటెక్ మాస్ కాపీయింగ్‌కు పాల్పడేవాడని వెల్లడైంది. ఉదాహరణకు.. ఇటీవల నిర్వహించిన అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన ఆఫీసర్ పరీక్షలో హైటెక్ మాస్ కాపీయింగ్‌కు పాల్పడ్డాడు. ఈ క్రమంలోనే.. టోలీచౌకీకి చెందిన ఒక కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్న మహమ్మద్ పాషాను సంప్రదించి డబ్బు ఎర వేసిడీఏవో, ఏఈఈ ప్రశ్నపత్రాలు వాట్సా్‌పలో తెప్పించుకొని హైటెక్ మాస్ కాపీయింగ్‌కు పాల్పడినట్లు విచారణలో తేలింది.