నేడు ఖమ్మంలో బీజేపీ నిరుద్యోగ మార్చ్
ABN , First Publish Date - 2023-05-27T03:29:07+05:30 IST
ఖమ్మం పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్.వి.సుభాష్ తెలిపారు.

హైదరాబాద్, ఖమ్మం, మే 26 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఖమ్మం పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్.వి.సుభాష్ తెలిపారు. ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరవనున్నారని చెప్పారు. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి ఆధ్వర్యంలో విచారణ జరపాలని, మంత్రి కేటీఆర్‌ను బర్తరఫ్ చేయాలని, బాధిత నిరుద్యోగులకు లక్ష రూపాయల చొప్పున ప్రభుత్వం పరిహారం ఇవ్వాలన్న డిమాండ్‌లతో నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తున్నట్లు శుక్రవారం ఆయన మీడియాకు చెప్పారు. ఖమ్మంలోని జడ్పీసెంటర్ నుంచి మయూరి సెంటర్ వరకు పాదయాత్ర ద్వారా నిరుద్యోగ మార్చ్ నిర్వహించి, అనంతరం మయూరిసెంటర్‌లో బహిరంగసభ నిర్వహించనున్నారు.