వైభవంగా భక్త రామదాసు జయంతి

ABN , First Publish Date - 2023-01-26T00:48:00+05:30 IST

మాట్లాడుతున్న డాక్టర్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు వైభవంగా భక్త రామదాసు జయంతి కవాడిగూడ, జనవరి 25 (ఆంధ్రజ్యోతి) : భద్రాచలం రామదాసు 390వ జయంత్యుత్సవాలు ట్యాంక్‌బండ్‌పై బుధవారం వైభవంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి హరిహరా ఫౌండేషన్‌ అధ్యక్షుడు మారగాని శ్రీనివా్‌సరావు ఆధ్వర్యంలో అతిథులు పూలమాలలువేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీటీడీ నాదస్వర బృందం కచేరీ నిర్వహించింది. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు డాక్టర్‌ రమాప్రభ ఆధ్వర్యంలో ఆమె శిష్యబృందం నవరత్న కీర్తనలు ఆలపించారు. కార్యక్రమంలో బీసీ కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు మాట్లాడారు. భక్త రామదాసు కీర్తనలకు బహళ ప్రాచుర్యం కల్పించేందుకు కృషి చేస్తున్నట్టు ఫౌండేషన్‌ అధ్యక్షుడు మారగాని శ్రీనివా్‌సరావు తెలిపారు. సరస్వతీ ఉపాఽసకులు దైవజ్ఞశర్మ అధ్యక్షత వహించిన కార్యక్రమంలో భవానీ శంకర్‌, జర్నలిస్టు ఎం.వెంకటేశ్వర్‌రావు, సీనియర్‌ పాత్రికేయులు డాక్టర్‌ కె.రామదాసు, కంచర్ల వెంకటరమణ, అశ్విన్‌ తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా భక్త రామదాసు జయంతి

మాట్లాడుతున్న డాక్టర్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు

కవాడిగూడ, జనవరి 25 (ఆంధ్రజ్యోతి) : భద్రాచలం రామదాసు 390వ జయంత్యుత్సవాలు ట్యాంక్‌బండ్‌పై బుధవారం వైభవంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి హరిహరా ఫౌండేషన్‌ అధ్యక్షుడు మారగాని శ్రీనివా్‌సరావు ఆధ్వర్యంలో అతిథులు పూలమాలలువేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీటీడీ నాదస్వర బృందం కచేరీ నిర్వహించింది. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు డాక్టర్‌ రమాప్రభ ఆధ్వర్యంలో ఆమె శిష్యబృందం నవరత్న కీర్తనలు ఆలపించారు. కార్యక్రమంలో బీసీ కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు మాట్లాడారు. భక్త రామదాసు కీర్తనలకు బహళ ప్రాచుర్యం కల్పించేందుకు కృషి చేస్తున్నట్టు ఫౌండేషన్‌ అధ్యక్షుడు మారగాని శ్రీనివా్‌సరావు తెలిపారు. సరస్వతీ ఉపాఽసకులు దైవజ్ఞశర్మ అధ్యక్షత వహించిన కార్యక్రమంలో భవానీ శంకర్‌, జర్నలిస్టు ఎం.వెంకటేశ్వర్‌రావు, సీనియర్‌ పాత్రికేయులు డాక్టర్‌ కె.రామదాసు, కంచర్ల వెంకటరమణ, అశ్విన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-26T00:48:04+05:30 IST