Hyderabad: మలక్‌పేట ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం

ABN , First Publish Date - 2023-01-13T12:33:57+05:30 IST

హైదరాబాద్: మలక్‌పేట ప్రభుత్వ ఆస్పత్రి (Government Hospital)లో దారుణం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో ఇద్దరు బాలింతలు మృతి చెందారు.

Hyderabad: మలక్‌పేట ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం

హైదరాబాద్: మలక్‌పేట ప్రభుత్వ ఆస్పత్రి (Government Hospital)లో దారుణం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో ఇద్దరు బాలింతలు మృతి చెందారు. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే చనిపోయారని మృతుల బంధువులు ఆరోపించారు. ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. హైదరాబాద్‌కు చెందిన శివాని అనే గర్భిణిని ఆమె కుటుంబసభ్యలు ఆస్పత్రికి తీసుకువచ్చారు. డాక్లర్లు ముందస్తు వైద్య పరీక్షలు చేయకుండా ఆపరేషన్ చేశారు. ఆ తర్వాత ఆమెకు తీవ్ర రక్తస్త్రావం కావడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమెకు డెంగ్యూ, బీపీ ఉండడం గమనించారు. చికిత్స పొందుతూ శివాని చనిపోయింది.

మరొకరు నాగర్ కర్నూలు జిల్లా, చెదురుపల్లికి చెందిన సిరివెన్నెలను ఆమె కుటుంబసభ్యులు ప్రసవం కోసం మలక్‌పేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అయితే ఆమెకు డెంగ్యూ ఉన్నా.. వైద్యులు గుర్తించలేదు. అలాగే ఆమెకు డెలివరీ చేశారు. ప్లేట్ లెట్స్ పడిపోవడంతో హుటా హుటిన గాంధీకు తరలించారు. చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. ఒకే రోజు ఇద్దరు బాలింతలు మృతి చెందడంతో మృతుల బంధువులు ఆందోళన చేపట్టారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే మహిళలు చనిపోయారని ఆరోపించారు. నిర్లక్ష్యం వహించిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. డాక్టర్లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని బందువులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రి వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు మోహరించారు.

Updated Date - 2023-01-13T12:38:47+05:30 IST