ఆంధ్రజ్యోతి ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణారావుకు మాతృవియోగం
ABN , First Publish Date - 2023-06-08T05:04:46+05:30 IST
సీనియర్ జర్నలిస్టు, ఆంధ్రజ్యోతి ఢిల్లీబ్యూరో చీఫ్ ఏ కృష్ణారావు తల్లి సంపతమ్మ (86) మంగళవారం రాత్రి 7.55 గంటలకు అనారోగ్యంతో మరణించారు. మియాపూర్ మయూరి నగర్‌లోని వెంకటసాయి రెసిడెన్సీలో నివాసముంటోన్న ఆమె మూ డో కుమారుడు ప్రొఫెసర్ శ్రీహరి రావు ఇంట్లో ఆమె కన్నుమూశారు.
హైదరాబాద్, జూన 7 (ఆంధ్రజ్యోతి): సీనియర్ జర్నలిస్టు, ఆంధ్రజ్యోతి ఢిల్లీబ్యూరో చీఫ్ ఏ కృష్ణారావు తల్లి సంపతమ్మ (86) మంగళవారం రాత్రి 7.55 గంటలకు అనారోగ్యంతో మరణించారు. మియాపూర్ మయూరి నగర్‌లోని వెంకటసాయి రెసిడెన్సీలో నివాసముంటోన్న ఆమె మూ డో కుమారుడు ప్రొఫెసర్ శ్రీహరి రావు ఇంట్లో ఆమె కన్నుమూశారు. పాలమూరు జిల్లాకు చెందిన కృష్ణారావు తల్లిదండ్రులు అప్పర్సు శేషగిరిరావు, సంపతమ్మ. వీరికి ఐదుగురు కుమారులు. తెలంగాణ సాయుధ పోరాటంలో మఖ్దూమ్ మొహియుద్దీనతో కలిసి శేషగిరిరావు పనిచేశారు. 2005లో శేషగిరిరావు మరణించా. తెలంగాణ ఉద్యమ సమయంలో పలుమార్లు సంపతమ్మ తన వాణి వినిపించారు. సంపతమ్మ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సంపతమ్మ తెలంగాణవాది అని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేసుకున్నారు. ఆమె భౌతికకాయాన్ని ఆంధ్రజ్యోతి సంపాదకుడు కె. శ్రీనివాస్, నెట్‌వర్క్ ఇనచార్జి కృష్ణప్రసాద్, సీనియర్ పాత్రికేయుడు కె. రామచంద్రమూర్తి, ఆంధ్రప్రదేశ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, ఎమెస్కో అధినేత విజయ్‌కుమార్, సంపతమ్మ పార్థివదేహం వద్ద నివాళులు అర్పించారు. సంపతమ్మ మరో కుమారుడు ఏ శ్రీనివాసరావు హిందూస్తాన టైమ్స్ అసోసియేట్ ఎడిటర్‌గా కొనసాగుతున్నారు.