రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2023-02-21T01:03:47+05:30 IST
రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. సికింద్రాబాద్ హెడ్ కానిస్టేబుల్ అపర్ణ తెలిపిన వివరాల ప్రకారం.. బీబీనగర్-ఘట్‌కేసర్ రైల్వేస్టేషన్ మార్గ మధ్యంలో సోమవారం గుర్తుతెలియని వ్యక్తి(35) పట్టాలు దాటుతున్నాడు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. సికింద్రాబాద్ హెడ్ కానిస్టేబుల్ అపర్ణ తెలిపిన వివరాల ప్రకారం.. బీబీనగర్-ఘట్‌కేసర్ రైల్వేస్టేషన్ మార్గ మధ్యంలో సోమవారం గుర్తుతెలియని వ్యక్తి(35) పట్టాలు దాటుతున్నాడు. వేగంగా వచ్చిన రైలు ఢీకొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి సంబంధీకులు సికింద్రాబాద్ రైల్వే పోలీసులు లేదా 9440627514 ఫోన్ నెంబర్‌లో సంప్రదించాలని హెడ్ కానిస్టేబుల్ అపర్ణ సూచించారు.