ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సోషల్ మీడియాలో దుర్భాష
ABN , First Publish Date - 2023-04-03T00:43:34+05:30 IST
సోషల్ మీడియాలో ఎమ్మెల్యే రాజాసింగ్‌పై దుర్భాషలాడిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు
సుమోటోగా కేసు నమోదు
యువకుడి అరెస్ట్
బంజారాహిల్స్, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): సోషల్ మీడియాలో ఎమ్మెల్యే రాజాసింగ్‌పై దుర్భాషలాడిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీరామనవమి శోభాయాత్రలో భాగంగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విదితమే. మలక్‌పేటకు చెందిన ప్రైవేటు ఉద్యోగి ఫైజల్ సోషల్ మీడియాలో రాజాసింగ్‌ను దుర్భషలాడాడు. ఈ వీడియో వైరల్‌గా మారింది. బంజారాహిల్స్ పోలీసులు ఈ వీడియోను సుమోటోగా తీసుకొని అతనిపై పలు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.