రాజాసింగ్‌ను చంపుతానని ఆగంతుకుడి ఫోన్‌

ABN , First Publish Date - 2023-02-21T03:29:17+05:30 IST

ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మరోమారు పాకిస్థాన్‌ నుంచి బెదిరింపు ఫోన్‌కాల్‌ వచ్చింది. తనను చంపుతానని ఓ ఆగంతుకుడు ఫోన్‌ చేసి బెదిరించినట్లు ఆయన సోమవారం ట్విటర్‌ ద్వారా తెలిపారు.

రాజాసింగ్‌ను చంపుతానని ఆగంతుకుడి ఫోన్‌

ట్విటర్‌లో వెల్లడించిన ఎమ్మెల్యే

మంగళ్‌హాట్‌, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మరోమారు పాకిస్థాన్‌ నుంచి బెదిరింపు ఫోన్‌కాల్‌ వచ్చింది. తనను చంపుతానని ఓ ఆగంతుకుడు ఫోన్‌ చేసి బెదిరించినట్లు ఆయన సోమవారం ట్విటర్‌ ద్వారా తెలిపారు. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఓ ఆగంతుకుడు ఫోన్‌ చేశాడని, తనతో పాటు తన కుటుంబ వివరాలు పూర్తిగా వారికి తెలుసునని, తనను చంపుతానని బెదిరించాడని రాజాసింగ్‌ పేర్కొన్నారు. ఆ ఆగంతుకుడికి స్లీపర్‌ సెల్స్‌ ఉన్నారని, వారి ద్వారా ఏదైనా చేస్తానని చెప్పాడని ఆయన తెలిపారు. ఇప్పటికే పలుమార్లు ఇలాంటి కాల్స్‌ వచ్చాయని, పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు. కేంద్ర హోంశాఖ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, రాష్ట్ర డీజీపీ, సిటీ సీపీని ట్యాగ్‌ చేస్తూ తనను బెదిరించిన వ్యక్తి ఫొటోను కూడా రాజాసింగ్‌ ట్వీట్‌ చేశారు.

Updated Date - 2023-02-21T03:29:18+05:30 IST