నాలాలో పడిన ఆవు
ABN , First Publish Date - 2023-07-19T03:50:50+05:30 IST
మెట్టుగూడ డివిజన్ ఆలుగడ్డ బావి ముత్యాలమ్మ ఎల్లమ్మ ఆలయం వద్ద ప్రవహించే నాలాలో మంగళవారం ప్రమాదవశాత్తు ఆవు పడింది.
కాపాడిన మున్సిపల్ సిబ్బంది
చిలకలగూడ,జూలై18(ఆంధ్రజ్యోతి): మెట్టుగూడ డివిజన్ ఆలుగడ్డ బావి ముత్యాలమ్మ ఎల్లమ్మ ఆలయం వద్ద ప్రవహించే నాలాలో మంగళవారం ప్రమాదవశాత్తు ఆవు పడింది. వెంటనే జీహెచ్‌ఎంసీ సిబ్బంది, బీఆర్‌ఎస్ కార్యకర్తలు నాలుగు గంటలు కష్టపడి ఆవును రక్షించి డూడ్‌బావి కమాన్ వద్ద యజమాని సాయి యాదవ్‌కి అప్పగించారు. ఆవును బయటికి తీసుకు రావడానికి తీవ్రంగా శ్రమించిన సిబ్బందికి స్థానికులు అభినందనలు తెలిపారు.