రుణమాఫీకి 6,285 కోట్లు చాలు: నిరంజన్‌రెడ్డి

ABN , First Publish Date - 2023-02-13T03:36:42+05:30 IST

తాజా బడ్జెట్‌లో కేటాయించిన రూ.6,285 కోట్ల నిధులు రుణమాఫీకి దాదాపుగా సరిపోతాయని, రూ.90 వేల వరకు రుణమాఫీ ప్రక్రియ పూర్తవుతుందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు.

రుణమాఫీకి  6,285 కోట్లు చాలు: నిరంజన్‌రెడ్డి

తాజా బడ్జెట్‌లో కేటాయించిన రూ.6,285 కోట్ల నిధులు రుణమాఫీకి దాదాపుగా సరిపోతాయని, రూ.90 వేల వరకు రుణమాఫీ ప్రక్రియ పూర్తవుతుందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. 2018లో రెండోసారి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రూ.25 వేల వరకు 5,42,609 మంది రైతులకు రుణమాఫీ చేసినట్లు తెలిపారు. రెండో విడత రుణమాఫీ ప్రక్రియ రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు పురోగతిలో ఉన్నట్లు పేర్కొన్నారు. రుణమాఫీకి కేటాయించిన నిధులు సరిపోవని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పోదెం వీరయ్య మాట్లాడగా.. ఈ ఆర్థిక సంవత్సరం ఇంకా ముగియలేదని, దాదాపు రెండు నెలల సమయం ఉన్నదని, ఇప్పుడే తొందరెందుకని నిరంజన్‌రెడ్డి అన్నారు.

Updated Date - 2023-02-13T03:36:43+05:30 IST