Hyderabad: నుమాయిష్‎లో 41 మంది ఆకతాయిల అరెస్ట్‌

ABN , First Publish Date - 2023-01-31T09:56:29+05:30 IST

నుమాయిష్‎లో(Numaish) మహిళలు, యువతుల పట్ల అసభ్యకరంగా(obscenely) ప్రవర్తించిన, మాట్లాడిన

Hyderabad: నుమాయిష్‎లో 41 మంది ఆకతాయిల అరెస్ట్‌

హైదరాబాద్/అఫ్జల్‌గంజ్‌: నుమాయిష్‎లో(Numaish) మహిళలు, యువతుల పట్ల అసభ్యకరంగా(obscenely) ప్రవర్తించిన, మాట్లాడిన 41 మంది ఆకతాయిలపై కేసులు నమోదు చేసి జైలుకు పంపామని బేగంబజార్‌ ఇన్‌స్పెక్టర్‌ శంకర్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఇన్‌స్పెక్టర్‌ మాట్లాడుతూ నుమాయి్‌షను రోజూ 50 వేల మందికి పైగా సందర్శిస్తున్నారని, ఇందులో ముఖ్యంగా మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో వస్తున్నారని తెలిపారు. భారీ సమూహంలో తమను ఎవరూ గుర్తించలేరనే ఉద్దేశంతో మహిళలు, యువతులను ఉద్దేశ పూర్వకంగా తాకుతూ, బిగ్గరగా ఆరవడం వంటివి చేస్తున్న పోకిరీలను గుర్తించామని తెలిపారు. మైదానమంతా మఫ్టీలో మహిళా పోలీసులు సైతం నిఘాలో ఉన్నారని, ఇలాంటి ఆకతాయిలు భరతం పట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. పోకిరీలకు న్యాయస్థానం 3-10 రోజుల జైలు శిక్ష విధించే అవకాశముందని ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.

Updated Date - 2023-01-31T09:56:34+05:30 IST