ఎంసెట్‌కు 1.80 లక్షల దరఖాస్తులు

ABN , First Publish Date - 2023-03-31T03:48:44+05:30 IST

ఎంసెట్‌ ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. గురువారం సాయంత్రం వరకు రాష్ట్రంలో 1.80 లక్షలకు పైగా విద్యార్థులు ఎంసెట్‌ కోసం దరఖాస్తు చేశారు.

ఎంసెట్‌కు 1.80 లక్షల దరఖాస్తులు

హైదరాబాద్‌, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): ఎంసెట్‌ ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. గురువారం సాయంత్రం వరకు రాష్ట్రంలో 1.80 లక్షలకు పైగా విద్యార్థులు ఎంసెట్‌ కోసం దరఖాస్తు చేశారు. దరఖాస్తుల సమర్పణకు ఏప్రిల్‌ 10 వరకు గడువు ఉంది. ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తుల్లో ఇంజనీరింగ్‌ విభాగానికి 1,14,989, అగ్రికల్చర్‌ విభాగానికి 65,033, రెండు విభాగాలకు 218 దర ఖాస్తులు వచ్చాయి. రాష్ట్రంలో ఎంసెట్‌ ప్రవేశ పరీక్షలు మే 7న ప్రారంభమై 11 వరకు కొనసాగనున్నాయి. మే 7, 8, 9 తేదీల్లో ఇంజనీరింగ్‌, 10, 11 తేదీల్లో అగ్రిక్చలర్‌ విభాగం పరీక్షలుంటాయి.

Updated Date - 2023-03-31T03:48:44+05:30 IST