టీఎస్‌ఆర్టీసీకి 1,500 కోట్లు

ABN , First Publish Date - 2023-02-07T04:36:02+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం టీఎ్‌సఆర్టీసీకి బడ్జెట్‌లో రూ.1,500 కోట్లు కేటాయించింది. గత ఏడాది కేటాయించిన నిధులే పూర్తి స్థాయిలో విడుదల కాకపోవడంతో సంస్థలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

టీఎస్‌ఆర్టీసీకి 1,500 కోట్లు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం టీఎ్‌సఆర్టీసీకి బడ్జెట్‌లో రూ.1,500 కోట్లు కేటాయించింది. గత ఏడాది కేటాయించిన నిధులే పూర్తి స్థాయిలో విడుదల కాకపోవడంతో సంస్థలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత ఏడాదిలాగే రూ.1,500 కోట్లను ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయించింది. ఇందులో వివిధ వర్గాలకు ప్రయాణ రాయితీ బస్‌పా్‌సలకు రీయింబర్స్‌మెంట్‌ కింద రూ.850 కోట్లు కేటాయించగా.. పబ్లిక్‌ సెక్టార్‌ అండర్‌ టేకింగ్‌ సంస్థగా మరో రూ.650 కోట్లు రుణంగా సమకూర్చనున్నారు. గత ఏడాది బడ్జెట్‌లో కేటాయించిన రూ.1,500 కోట్లలో ఇప్పటి వరకు రూ.590 కోట్లు మాత్రమే విడుదలయ్యాయని, ఈ ఏడాది మరో రూ.910 కోట్లు విడుదల కావాల్సి ఉన్నట్టు తెలుస్తోంది.

Updated Date - 2023-02-07T04:36:04+05:30 IST