ప్రతి ఒక్కరిపై 1.29 లక్షల అప్పు

ABN , First Publish Date - 2023-02-07T04:38:52+05:30 IST

రాష్ట్ర అప్పు నానాటికీ పెరుగుతోంది. ఇది ప్రభుత్వానికి గుదిబండగా మారుతున్నా భారీ సంక్షేమ పథకాలు, కార్యక్రమాల దృష్ట్యా అప్పులు చేయక తప్పడం లేదు.

ప్రతి ఒక్కరిపై 1.29 లక్షల అప్పు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర అప్పు నానాటికీ పెరుగుతోంది. ఇది ప్రభుత్వానికి గుదిబండగా మారుతున్నా భారీ సంక్షేమ పథకాలు, కార్యక్రమాల దృష్ట్యా అప్పులు చేయక తప్పడం లేదు. ప్రభుత్వం 2023-24లో ప్రతిపాదించిన అప్పుతో కలిపి మొత్తం అప్పు రూ.3,57,059 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. ఇందులో ఓపెన్‌ మార్కెట్‌ నుంచి రూ.3,10,363 కోట్లు, కేంద్ర ప్రభుత్వం ద్వారా 14,658 కోట్లు, ఇతర స్వతంత్ర సంస్థల నుంచి రూ.12,670 కోట్లు, స్మాల్‌ సేవింగ్స్‌, ప్రావిడెంట్‌ ఫండ్‌ వంటి ద్వారా అప్పులు రూ.19,368 కోట్లు అవుతాయి. రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకు గ్యారెంటీ ఇవ్వడంతో వివిధ కార్పొరేషన్లు తీసుకున్న అప్పులు రూ.1,29,243 కోట్లుగా ఉన్నాయి. బడ్జెట్‌ అప్పులు, గ్యారంటీ అప్పులు కలిపి రూ.4,86,302 కోట్లకు చేరతాయని అంచనా. ఈ అప్పును ప్రస్తుత రాష్ట్ర జనాభా 3.77 కోట్లతో భాగిస్తే... ఒక్కొక్కరి తలపై భారం రూ.1,28,992గా తేలుతోంది. కాగా, సవరించిన అంచనాల ప్రకారం మార్చి చివరినాటికి అప్పు 3,22,992 కోట్లు ఉండగా, అసలు కింద రూ.13,787 కోట్లు చెల్లించాల్సి ఉందని బడ్జెట్‌లో పేర్కొన్నారు.

Updated Date - 2023-02-07T04:38:53+05:30 IST