Drunken driveలో 10 మందికి జైలు

ABN , First Publish Date - 2023-02-01T08:44:16+05:30 IST

రాజేంద్రనగర్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో డ్రంకెన్‌ డ్రైవ్‌ చేస్తూ పట్టుబడ్డ 10 మంది వాహనదారులకు

Drunken driveలో 10 మందికి జైలు

హైదరాబాద్/రాజేంద్రనగర్‌: రాజేంద్రనగర్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో డ్రంకెన్‌ డ్రైవ్‌ చేస్తూ పట్టుబడ్డ 10 మంది వాహనదారులకు రెండు రోజుల నుంచి 5 రోజుల వరకు జైలు శిక్ష పడింది. మంగళవారం డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులను పరిశీలించిన రాజేంద్రనగర్‌ స్పెషల్‌ కోర్టు న్యాయమూర్తి నజీరుద్దీన్‌ ఈ శిక్షలు విధించారు. పది మందిలో ఇద్దరికి ఐదు రోజులు, ముగ్గురికి నాలుగు రోజులు, నలుగురికి మూడు రోజులు, ఒకరికి రెండు రోజుల పాటు శిక్ష విధించారు. బీఏసీ రీడింగ్‌ ఆధారంగా ఈ శిక్షలు పడ్డాయని రాజేంద్రనగర్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్యాంసుందర్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2023-02-01T08:44:18+05:30 IST