Hyderabad: వణికిస్తున్న చలి.. పటాన్‌చెరులో 12.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత
ABN , Publish Date - Dec 14 , 2023 | 07:38 AM
నగరవాసులను చలి వణికిస్తోంది. బుధవారం పటాన్‌చెరు(Patancheru)లో 12.4, రాజేంద్రనగర్‌లో
హైదరాబాద్ సిటీ, (ఆంధ్రజ్యోతి): నగరవాసులను చలి వణికిస్తోంది. బుధవారం పటాన్‌చెరు(Patancheru)లో 12.4, రాజేంద్రనగర్‌లో 12.5, దుండిగల్‌లో 18 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 7 గంటల వరకు పొగమంచు రహదారులను కప్పేయడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. మరో రెండు రోజులు గరిష్ఠంగా 29, కనిష్ఠంగా 16 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలుంటాయని బేగంపేట వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. 4-6 కిలోమీటర్ల వేగంతో ఉపరితల గాలులు తూర్పు దిశగా వీస్తాయని వివరించారు.