Share News

Hyderabad: కారులో రూ. 18 లక్షలు పట్టివేత

ABN , First Publish Date - 2023-11-29T12:14:27+05:30 IST

ముషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గాంధీ నగర్‌లో ఓ అపార్ట్‌మెంట్‌ పార్కింగ్‌లోని ఓ కారులో రూ.18 లక్షల ను ముషీరాబాద్‌ పోలీసులు

Hyderabad: కారులో రూ. 18 లక్షలు పట్టివేత

రాంనగర్‌(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): ముషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గాంధీ నగర్‌లో ఓ అపార్ట్‌మెంట్‌ పార్కింగ్‌లోని ఓ కారులో రూ.18 లక్షల ను ముషీరాబాద్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గాంధీనగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో డబ్బులు పంచుతున్నట్టు ఫిర్యాదు రావడంతో పోలీసులు దాడి డబ్బును పట్టుకున్నారు. కారు యజమాని అందుబాటులో లేకపోవడంతో కారు అద్దాలు పగలగొట్టి డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. అందులో పేటీఎం స్కానర్‌ రెండు సెల్‌ఫోన్లు ఆ డబ్బులు ఎవరెవరికి ఇయ్యాలో కూడా రాసి ఉంది. కేసును ముషీరాబాద్‌ సీఐ జాంగిర్‌ యాదవ్‌ దర్యాప్తు చేస్తున్నారు

Updated Date - 2023-11-29T12:14:29+05:30 IST