HYD: కిలో బంతిపూలు రూ. 250
ABN , First Publish Date - 2023-10-14T10:18:36+05:30 IST
బతుకమ్మ పండగ నేపథ్యంలో పూల ధరలకు రెక్కలొచ్చాయి. వర్షాభావం కారణంగా దిగుమతి లేకపోవడంతో గునుగు, తంగేడు, బంతి, చేమంతి
- బతుకమ్మ పండగతో ధరలకు రెక్కలు
హైదరాబాద్ సిటీ, (ఆంధ్రజ్యోతి): బతుకమ్మ పండగ నేపథ్యంలో పూల ధరలకు రెక్కలొచ్చాయి. వర్షాభావం కారణంగా దిగుమతి లేకపోవడంతో గునుగు, తంగేడు, బంతి, చేమంతి పూల ధరలు పెరిగాయి. హోల్‌సేల్ మార్కెట్‌కు డిమాండ్‌కు తగ్గ స్థాయిలో పూలు రాకపోవడంతో బంతి, చామంతి పూలకు డిమాండ్ పెరిగింది. నాలుగురోజుల క్రితం వరకు కిలో బంతిపూలు రూ. 100-120 వరకు ఉంటే శుక్రవారం కిలో పూలు రూ.250 పైకి ధర పలికాయి. శనివారం అమావాస్య మార్కెట్ బంద్ ఉండనుండడంతో శుక్రవారం రాత్రి వరకు మార్కెట్లు కళకళలాడాయని వ్యాపారులు తెలిపారు.