Share News

Jubilee Hills : విష్ణును పక్కనెట్టి అజారుద్దీన్‌కే కాంగ్రెస్ టికెట్ ఎందుకు..?

ABN , First Publish Date - 2023-10-28T09:53:16+05:30 IST

కాంగ్రెస్‌ రెండో జాబితాలో జూబ్లీహిల్స్‌, ఖైరతాబాద్‌(Jubilee Hills, Khairatabad) నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించింది. జూబ్లీహిల్స్‌ అభ్యర్థిగా

Jubilee Hills : విష్ణును పక్కనెట్టి అజారుద్దీన్‌కే కాంగ్రెస్ టికెట్ ఎందుకు..?

- కాంగ్రెస్‌ అభ్యర్థులు ఖారారు

- విష్ణుకు చేయిచ్చిన అధిష్ఠానం

- అనూహ్యంగా అజారుద్దీన్‌కు స్థానం

బంజారాహిల్స్‌(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ రెండో జాబితాలో జూబ్లీహిల్స్‌, ఖైరతాబాద్‌(Jubilee Hills, Khairatabad) నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించింది. జూబ్లీహిల్స్‌ అభ్యర్థిగా మాజీ క్రికెటర్‌ అజారుద్దీన్‌, ఖైరతాబాద్‌ అభ్యర్థిగా పీజేఆర్‌ కుమార్తె పి.విజయారెడ్డికి అవకాశం కల్పించారు. పీజేఆర్‌ కుటుంబంలో ఎవరికి ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో అధిష్ఠానం తర్జన భర్జన పడింది. జూబ్లీహిల్స్‌ నుంచి పి.విష్ణువర్ధన్‌రెడ్డి, ఖైరతాబాద్‌ నుంచి పి.విజయారెడ్డి దివంగత నేత కుటుంబం నుంచి టికెట్‌ ఆశించారు. వీరిలో ఎవరికి అవకాశం ఇవ్వాలనే అంశంపై స్ర్కీనింగ్‌ కమిటీ పలుమార్లు బైఠాయించింది. చివరకు విజయారెడ్డి వైపే మొగ్గు చూపించింది. ఖైరతాబాద్‌ నుంచి పి.విజయారెడ్డితోపాటు డీసీసీ అధ్యక్షుడు డాక్టర్‌ సింగిరెడ్డి రోహిణ్‌రెడ్డి టికెట్‌ ఆశిస్తూ వచ్చారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కలగజేసుకొని రోహిణ్‌రెడ్డిని అంబర్‌పేట నుంచి పోటీ చేసేలా ఒప్పించారు. దీంతో విజయారెడ్డికి మార్గం సుగమమం అయింది. ఈ నిర్ణయంతో నియోజకవర్గంలో అసమ్మతికి కూడా చెక్‌ పెట్టినట్టు అయింది.

P-Vijaya-Reddy.jpg

విష్ణుకు ఎందుకివ్వలేదు..

ఇక జూబ్లీహిల్స్‌ నుంచి పి.విష్ణువర్ధన్‌రెడ్డితోపాటు మాజీ క్రికెటర్‌ అజారుద్దీన్‌ పేరు పరిశీలనకు వచ్చింది. మొదట విష్ణుకే టికెట్‌ వస్తుందని అందరూ భావించారు. పార్టీ విషయంలో ఆయన నిర్లక్ష్య ధోరణిని అధిష్ఠానం సీరియ్‌సగా తీసుకుంది. పార్టీ కోసం పనిచేయని వారికి టికెట్‌ ఎలా ఇస్తారనే వాదనలు వెల్లువెత్తాయి. దీంతో విష్ణుకు చెక్‌ పెడుతూ అజారుద్దీన్‌ పేరును ఖరారు చేశారు. విష్ణుకు చెందిన ఓ సన్నిహిత వర్గం అజారుద్దీన్‌ వైపు మొగ్గు చూపించింది. విష్ణు నాయకత్వం వద్దంటూ అధిష్ఠానంను కలిసింది. అవన్నీ పరిగణలోకి తీసుకోవడంతోపాటు నియోజకవర్గంలోని మైనార్టీ ఓటర్లను దృష్టిలో పెట్టుకొని అధిష్ఠానం అజారుద్దీన్‌ పేరు ప్రకటించింది. నియోజకవర్గంలో తలెత్తే అసమ్మతి విషయంలో పార్టీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Azaruddin-Vs-Vishnu.jpg

కాంగ్రెస్‌ అభ్యర్థుల బయోడేటా..

నియోజకవర్గం: ఖైరతాబాద్‌

అభ్యర్థి పేరు : పబ్బతిరెడ్డి విజయారెడ్డి

తల్లి పేరు : సులోచన

తండ్రి పేరు : స్వర్గీయ పి.జనార్ధన్‌రెడ్డి

భర్త : జీవీబీఆర్‌రెడ్డి

సంతానం : ప్రభాత్‌, హరీశ్వరి

పుట్టిన తేదీ : 26-10-1979

విద్యార్హతలు : ఎంటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌

కులం : రెడ్డి

చిరునామా : ఇంటి నంబర్‌ 12-2-823/ఏ/36 సంతోష్ నగర్‌, మెహిదీపట్నం దర్గా, హైదరాబాద్‌

రాజకీయ అనుభవం : 2009 నుంచి రాజకీయాల్లో ఉన్నారు. 2014లో ఖైరతాబాద్‌ అసెంబ్లీ స్థానానికి వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2015లో టీఆర్‌ఎ్‌సలో చేరి ఖైరతాబాద్‌ కార్పొరేటర్‌గా రెండుసార్లు గెలిచారు. 2022లో తిరిగి కాంగ్రెస్‌లో చేరిన విజయారెడ్డి.. ప్రస్తుతం టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు.

............................

నియోజకవర్గం : జూబ్లీహిల్స్‌

అభ్యర్థి పేరు : మహ్మద్‌ అజారుద్దీన్‌

తల్లి పేరు : యూసుఫ్‌ సుల్తానా

తండ్రి పేరు : మహ్మద్‌ అజీజ్‌ ఉద్దీన్‌

భార్య : శనూన్‌ మారి

సంతానం : అసదుద్దీన్‌

పుట్టిన తేదీ : 08/02/1963

విద్యార్హతలు : బ్యాచిలర్‌ ఇన్‌ కామర్స్‌

కులం: ముస్లిం

చిరునామా: బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌-2, హైదరాబాద్‌

రాజకీయ అనుభవం: భారత క్రికెట్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన మహ్మద్‌ అజారుద్దీన్‌ 2009 ఫిబ్రవరి 19న కాంగ్రె్‌సలో చేరారు. ఉత్తరప్రదేశ్‌ మురాదాబాద్‌ నుంచి పార్లమెంట్‌ సభ్యులుగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు.

Updated Date - 2023-10-28T11:17:59+05:30 IST