Kavitha: రాజ్‌భవన్‌ వద్ద హైటెన్షన్

ABN , First Publish Date - 2023-03-11T18:07:50+05:30 IST

రాజ్‌భవన్‌ (Raj Bhavan) వద్ద హైటెన్షన్ నెలకొంది. రాజ్‌భవన్‌ దగ్గర బీఆర్‌ఎస్ (BRS) మహిళా నేతల ఆందోళనకు దిగారు.

Kavitha: రాజ్‌భవన్‌ వద్ద హైటెన్షన్

హైదరాబాద్‌: రాజ్‌భవన్‌ (Raj Bhavan) వద్ద హైటెన్షన్ నెలకొంది. రాజ్‌భవన్‌ దగ్గర బీఆర్‌ఎస్ (BRS) మహిళా నేతల ఆందోళనకు దిగారు. ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)పై బీజేపీ నేత బండి సంజయ్‌ (BJP Leader Bandi Sanjay) చేసిన వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ తీవ్రంగా పరిగణించింది. బండి సంజయ్‌ వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ మహిళా నేతల ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్‌పై ఫిర్యాదు చేసేందుకు జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి (Vijayalakshmi)తో పాటు బీఆర్‌ఎస్ మహిళా నేతలు గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) అపాయింట్‌మెంట్ కోరారు. బీఆర్‌ఎస్ నేతలకు అపాయింట్‌మెంట్‌ లేదని రాజ్‌భవన్‌ వర్గాలు చెప్పాయి. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రికత్త పరిస్థితి నెలకొంది. రాజ్‌భవన్ ముందు పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. రాజ్‌భవన్‌ ఎదుట మేయర్‌, బీఆర్‌ఎస్ నేతల ఆందోళనకు దిగారు.

కవితపై బండి సంజయ్ వ్యాఖ్యలు హర్షణీయం కాదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabita IndraReddy) అన్నారు. సంజయ్ సంస్కారం మరిచి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ మహిళలతో పాటు, దేశంలో ఉన్న మహిళలందరికీ బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వ్యక్తిగత విమర్శలు సరికాదని గౌరవప్రదంగా మాట్లాడాలని హెచ్చరించారు. బండి సంజయ్‌‌పై మంత్రి సత్యవతి రాథోడ్ (Minister Satyavati Rathod) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజకీయాల విలువలు తగ్గిపోయాయని తెలిపారు. బండి సంజయ్ రాజకీయ విలువలేని వ్యక్తి అని సత్యవతి రాథోడ్ మండిపడ్డారు.

బండి సంజయ్‌పై తెలంగాణ మహిళా కమిషన్ సీరియస్

బండి సంజయ్‌పై తెలంగాణ మహిళా కమిషన్ సీరియస్ అయింది. కవితపై బండి సంజయ్ వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించింది. సంజయ్‌ వ్యాఖ్యలపై విచారణ చేయాలని డీజీపీ మహేందర్‌రెడ్డిని కమిషన్ ఆదేశించింది. సంజయ్‌ వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా ఉన్నాయని ఆగ్రహం మహిళా కమిషన్ వ్యక్తం చేసింది.

Updated Date - 2023-03-11T18:07:50+05:30 IST