Share News

Helicopter: దట్టమైన అటవీప్రాంతంలో.. హెలికాప్టర్‌ చక్కర్లు

ABN , First Publish Date - 2023-12-09T10:31:06+05:30 IST

ఆళ్లపల్లి మండలం అనంతోగు పంచాయతీ అడవుల సమీపంలో శుక్రవారం ఒక హెలికాఫ్టర్‌(Helicopter) చక్కర్లు కొట్టింది.

Helicopter: దట్టమైన అటవీప్రాంతంలో.. హెలికాప్టర్‌ చక్కర్లు

ఆళ్లపల్లి(భద్రాద్రి కొత్తగూడెం): ఆళ్లపల్లి మండలం అనంతోగు పంచాయతీ అడవుల సమీపంలో శుక్రవారం ఒక హెలికాఫ్టర్‌(Helicopter) చక్కర్లు కొట్టింది. తక్కువ ఎత్తులో నుంచి కాచనపల్లి పరిసర ప్రాంతాల నుంచి అనంతోగు పరిసర ప్రాంతాల్లో రెండు రౌండ్స్‌ కొట్టి వెళ్లిపోయినట్టు స్థానికులు తెలిపారు. పల్లె ప్రాంతంలో తక్కువ ఎత్తులో హెలికాఫ్టర్‌ రావడంతో పొలాల్లో ఉన్న రైతులు, గ్రామంలో ఉన్న పిల్లలు ఆకాశం వైపు చూడసాగారు. ఎన్నికల అనంతరం, శాంతియుత రోజుల్లో హెలికాఫ్టర్‌ చక్కర్లు కొట్టడంపై గ్రామాల్లో ఏమై ఉంటుందని చర్చించుకుంటున్నారు. ఈ విషయమై కొందరు స్థానిక ఉన్నత అధికారులను ‘ఆంధ్రజ్యోతి’ ప్రశ్నించగా.. అంత ప్రశాంత వాతావారణం, హెలికాఫ్టర్‌ రావడంపై ఏ సమాచారం లేదని తెలిపారు. కాగా హలికాఫ్టర్‌ చక్కర్లు కొట్టడంపై స్థానికులు తీవ్రంగా చర్చించుకున్నారు. అనేక మంది ఆసక్తిగా హెలికాప్టర్‌ను పరిశీలించారు.

Updated Date - 2023-12-09T10:31:08+05:30 IST