New Secretariat: తెలంగాణ సచివాలయ నిర్మాణంలో అందరి కృషి ఉంది: కేసీఆర్‌

ABN , First Publish Date - 2023-04-30T15:26:12+05:30 IST

తెలంగాణ సచివాలయ (Secretariat) నిర్మాణంలో అందరి కృషి ఉందని సీఎం కేసీఆర్‌ (CM KCR) స్పష్టం చేశారు. సచివాలయ తరహాలోనే తెలంగాణ..

New Secretariat: తెలంగాణ సచివాలయ నిర్మాణంలో అందరి కృషి ఉంది: కేసీఆర్‌

హైదరాబాద్: తెలంగాణ సచివాలయ (Secretariat) నిర్మాణంలో అందరి కృషి ఉందని సీఎం కేసీఆర్‌ (CM KCR) స్పష్టం చేశారు. సచివాలయ తరహాలోనే తెలంగాణ (Telangana) పల్లెలూ వెలుగుతున్నాయని తెలిపారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ (Ambedkar) చూపిన బాటలోనే ముందుకు సాగుతున్నామని ప్రకటించారు. గాంధీ మార్గంలోనే ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్ర పునర్నిర్మాణంపై కొందరు అవాకులు చెవాకులు పేలారని, తెలంగాణ మొత్తం కూలగొట్టి కడతారా అని హేళన చేశారని, విమర్శలు పట్టించుకోకుండా కృషి చేయడమే తమ విధానమని కేసీఆర్‌ స్పష్టం చేశారు. మత్తడి తొక్కుతున్న చెరువులే రాష్ట్ర పునర్నిర్మాణానికి తార్కాణమని వ్యాఖ్యానించారు. మిషన్‌ కాకతీయతో చెరువుల రూపురేఖలు మార్చామని తెలిపారు. రాష్ట్ర సాధనలో ప్రాణాలు అర్పించిన అందరికీ కేసీఆర్‌ జోహార్లు తెలిపారు.

‘‘తెలంగాణ అన్ని రంగాల్లోనూ దేశానికి మార్గదర్శకం. తెలంగాణ తలెత్తుకునేలా సచివాలయ నిర్మాణం. సచివాలయం నిర్మాణంలో ప్రతి ఒక్కరి కృషి ఉంది. అంబేడ్కర్, గాంధీ (Ambedkar Gandhi) చూపిన మార్గంలోనే తెలంగాణ సాధించాం. తెలంగాణ పునర్నిర్మాణ కాంక్షను అర్థం చేసుకోలేక.. కొందరు పిచ్చి కూతలు కూశారు. మరుగుజ్జుల మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కరవు పాలమూరులో వలసలు లేకుండా చేశాం. నల్లగొండ ఫ్లోరైడ్ సమస్యను మిషన్ భగీరథతో పరిష్కరించాం. మరుగుజ్జుల్లారా ఇప్పటికైనా మీ కుళ్లును మానుకోండి. సచివాలయం తరహాలోనే తెలంగాణ పల్లెలు వెలుగుతున్నాయి. అంతర్జాతీయ నగరంగా హైదరాబాద్ (Hyderabad) దూసుకుపోతోంది. కలియుగ వైకుంఠంగా యాదాద్రి నిలుస్తోంది. శోభాయమానంగా, శిఖరాయమానంగా సచివాలయంసెక్రటేరియట్ నిలుస్తోంది’’ అని కేసీఆర్ ప్రకటించారు.

కొత్త సచివాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్

కొత్త సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. సచివాలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. వాస్తు పూజ చేశారు. అనంతరం ఛాంబర్‌లో కేసీఆర్‌ను వేదపండితులు ఆశీర్వదించారు. కొత్త కార్యాలయంలో కేసీఆర్ కార్యకలాపాలు ప్రారంభించారు. పోడు పట్టాల మార్గదర్శకాలపై ఆయన తొలి సంతకం చేశారు. సీఎం సీఎం కేసీఆర్‌కు మంత్రులు, స్పీకర్, పలువురు నేతలు శుభాకాంక్షలు తెలిపారు. కాగా రూ.1,200 కోట్ల వ్యయంతో తెలంగాణ నూతన సచివాలయం నిర్మితమైంది. దీనికి డా.బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయంగా ప్రభుత్వం పేరు పెట్టిన విషయం తెలిసిందే. అంతకుముందు తూర్పుగేటు నుంచి సచివాలయంలోకి కేసీఆర్ వెళ్లారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అంతక్రితం కొత్త సెక్రటేరియట్ ప్రాంగణంలో సుదర్శన యాగం జరిగింది. మధ్యాహ్నం ఒంటి గంటకు మొదలై 1:20 గంటలకు పూర్తయిన ఈ యాగంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.

Updated Date - 2023-04-30T15:26:12+05:30 IST