Share News

Dussehra holidays: దసరా సెలవుల షెడ్యూల్‏లో మార్పులు.. ఒకరోజు అదనంగానే..

ABN , First Publish Date - 2023-10-21T08:14:45+05:30 IST

జేఎన్‌టీ యూనివర్సిటీ(JNT University) కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థులకు దసరా సెలవుల(Dussehra holidays)

Dussehra holidays: దసరా సెలవుల షెడ్యూల్‏లో మార్పులు.. ఒకరోజు అదనంగానే..

హైదరాబాద్‌ సిటీ, (ఆంధ్రజ్యోతి): జేఎన్‌టీ యూనివర్సిటీ(JNT University) కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థులకు దసరా సెలవుల(Dussehra holidays) షెడ్యూలులో మార్పులు చేస్తూ ప్రిన్సిపాల్‌ విజయకుమార్‌ రెడ్డి శుక్రవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. షెడ్యూలు ప్రకారం ఈ నెల 22నుంచి 24వరకు దసరా సెలవులు కాగా, పండుగ సెలవులను మరొకరోజు(25వరకు) పొడిగించారు. దూరప్రాంతాలకు వెళ్లి పండుగరోజే వెనక్కి రావాల్సి వస్తుందని, మరొకరోజు సెలవు కావాలని విద్యార్థులు రిక్వెస్టు చేశారని ప్రిన్సిపాల్‌ పేర్కొన్నారు. అదనపు సెలవు కారణంగా విద్యార్థులు కోల్పోయిన పాఠాలను నవంబరు మొదటి లేదా రెండవ శనివారం రోజుల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని హెచ్‌వోడీలను ప్రిన్సిపాల్‌ ఆదేశించారు.

25వరకు హాస్టళ్ల మూసివేత

దసరా సెలవుల నేపథ్యంలో నాలుగురోజుల పాటు జేఎన్‌టీయూలోని అన్ని బాలుర, బాలికల వసతిగృహాలను మూసివేస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ తెలిపారు. ఒకవేళ సెలవు రోజుల్లో సొంతూళ్లకు వెళ్లని విద్యార్థులు ఎవరైనా ఉంటే.. వారికి ప్రత్యామ్నాయ వసతి కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2023-10-21T08:14:45+05:30 IST