KCR: రేపు నాగర్ కర్నూలు జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన

ABN , First Publish Date - 2023-09-15T22:02:04+05:30 IST

రేపు నాగర్ కర్నూలు జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు.

KCR: రేపు నాగర్ కర్నూలు జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన

హైదరాబాద్: రేపు నాగర్ కర్నూలు జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గాన నాగర్ కర్నూల్ కు కేసీఆర్ వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒకటిన్నరకు నాగర్ కర్నూల్ లోని తేజ గార్డెన్స్ కు చేరుకోనున్నారు. తేజ గార్డెన్లో భోజనం చేయనున్నారు. మధ్యాహ్నం 2:30 కు తేజ గార్డెన్ నుంచి రోడ్డు మార్గాన మూడున్నరకు నార్లాపూర్ కంట్రోల్ రూమ్ కు చేరుకోనున్నారు. అనంతరం కంట్రోల్ రూమ్ లో కేసీఆర్ మోటార్ స్విచ్ ఆన్ చేయనున్నారు. నాలుగు గంటలకు నార్లాపూర్ రిజర్వాయర్ వద్దకు వెళ్లనున్నారు. నాలుగు గంటల 45 నిమిషాలకు కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఇంటికి వెళ్తారు. ఐదు గంటలకు రోడ్డు మార్గాన సభాస్థలికి చేరుకుంటారు. అనంతరం కొల్లాపూర్ లోని పాలమూరు యూనివర్సిటీ గ్రౌండ్స్ లో బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారు. అనంతరం కేసీఆర్ ప్రగతి భవన్‌కు బయలుదేరి వెళ్తారు.

Updated Date - 2023-09-15T22:03:02+05:30 IST