Chicken prices: ధర కొక్కొరోకో?.. చికెన్ రేటు తగ్గడానికి ఇంకెంత కాలం పడుతుందంటే...

ABN , First Publish Date - 2023-06-12T02:35:38+05:30 IST

మునుపెన్నడూ లేనివిధంగా హైదరాబాద్‌లో చికెన్‌ రేట్లు పెరిగాయి. వారం రోజుల క్రితం స్కిన్‌లె్‌స కిలో రూ.240 నుంచి రూ.260, లైవ్‌ కోడి రూ.140 నుంచి రూ.160 మధ్య విక్రయించారు.

Chicken prices: ధర కొక్కొరోకో?.. చికెన్ రేటు తగ్గడానికి ఇంకెంత కాలం  పడుతుందంటే...

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 11(ఆంధ్రజ్యోతి): మునుపెన్నడూ లేనివిధంగా హైదరాబాద్‌లో చికెన్‌ రేట్లు పెరిగాయి. వారం రోజుల క్రితం స్కిన్‌లె్‌స కిలో రూ.240 నుంచి రూ.260, లైవ్‌ కోడి రూ.140 నుంచి రూ.160 మధ్య విక్రయించారు. ఆదివారం మాత్రం ఏకంగా కిలోకు రూ.100 నుంచి 120 వరకు రేటు పెంచారు. ఇటీవల పెరిగిన ఎండల కారణంగా కోళ్లు చనిపోతున్నాయని.. దీంతో కొరత ఏర్పడుతోందని వ్యాపారులు చెబుతున్నారు. ఈ క్రమంలో భారీగా రేట్లు పెంచి అమ్మకాలు చేపట్టారు. హోల్‌సేల్‌లో స్కిన్‌లెస్ కిలో రూ.290 నుంచి రూ.310 మధ్యన, లైవ్‌ రూ.170కి విక్రయించారు. రిటైల్‌లో రూ.320 నుంచి రూ.340 వరకు, లైవ్‌ కోడిని రూ.190, నాటుకోడి కిలో రూ.380 నుంచి రూ.400 వరకు విక్రయించిన పరిస్థితి కనిపించింది. సెలవు రోజున చికెన్‌తో కడుపు నిండా భోజనం చేయాలని భావించిన వినియోగదారుడికి ధరలు ముచ్చెమటలు పట్టించాయి. ఇంటిల్లిపాదికి సరిపడా మాంసం తీసుకొచ్చేందుకు వెళ్లినవారు ఉసూరంటూ వెనదిరిగారు. సాధారణ రోజులతో పోల్చితే ఆదివారం హైదరాబాద్‌ వ్యాప్తంగా 40ు అమ్మకాలు పడిపోయినట్లు తెలిసింది. రూ.400 పెడితే అరకిలో మటన్‌ వస్తుందనే ఆలోచనతో వినియోగదారుల్లో చాలామంది మటన్‌ కొనేందుకు ఆసక్తి చూపారు. కాగా, నాలుగు రోజుల వరకు ధరలు తగ్గవని, వర్షాలు పూర్తి స్థాయిలో పడ్డాకే రేట్లు సాధారణ స్థాయికి చేరుకుంటాయని చికెన్‌ వ్యాపారులు చెప్పారు.

Updated Date - 2023-06-12T10:32:05+05:30 IST