Share News

BRS manifesto2023: రైతుబంధు రూ.16 వేలు.. పెన్షన్ రూ.5 వేలు.. బీఆర్ఎస్ మేనిఫెస్టో ఇదే...

ABN , First Publish Date - 2023-10-15T14:46:50+05:30 IST

సీఎం కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. తెలంగాణ భవన్‌లో మీడియా ముఖంగా హామీలను ప్రకటించారు.

BRS manifesto2023: రైతుబంధు రూ.16 వేలు.. పెన్షన్ రూ.5 వేలు.. బీఆర్ఎస్ మేనిఫెస్టో ఇదే...

హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. తెలంగాణ భవన్‌లో మీడియా ముఖంగా హామీలను ప్రకటించారు.

మేనిఫెస్టో ఇదే..

  • రైతుబంధు, దళితబంధును కొనసాగిస్తాం.

  • రైతుబంధును రూ.16 వేలు చేస్తాం.

  • ఆసరా పెన్షన్ రూ.2016 నుండి రూ.5016 పెంపు. అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం రూ.3016 చేసి 5 సంవత్సరాల్లో రూ.5016కి పెంపు. ఏడాదికి రూ.500 చొప్పున దశలవారీగా పెంపు.

  • సౌభాగ్యలక్ష్మి పథకం పేరిట అర్హులైన మహిళలకు నెలకు రూ.1000 భృతి.

  • తెల్ల రేషన్‌కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ.

  • దివ్యాంగుల పెన్షన్లు రూ.4016 నుంచి రూ.6 వేలకు పెంచుతాం. ప్రతి ఏటా రూ.300 చొప్పున పెంచుతాం.

  • కేసీఆర్ బీమా ప్రీమియం ప్రభుత్వమే భరిస్తుంది.

  • గిరిజనులకు పోడు పట్టాల కార్యక్రమం కొనసాగుతుంది.

  • గిరిజనులకు మరిన్ని సంక్షేమ పథకాలు తెస్తాం.

  • తండాలు, గోండుగూడెలను పంచాయతీలుగా చేస్తాం.

  • బీసీలకు అమలు చేస్తున్న పథకాలను కొనసాగిస్తాం.

  • రైతుబీమా తరహాలోనే పేదలకు కేసీఆర్ బీమా పథకం.

  • తెల్లరేషన్ కార్డుదారులకు రూ.5 లక్షల కేసీఆర్ బీమా.

  • అక్రెడిటేషన్ ఉన్న జర్నలిస్టులకు రూ.400లకే గ్యాస్ సిలిండర్.

  • తెలంగాణలో 93 లక్షల పైగా కుటుంబాలకు కేసీఆర్ బీమా.. ప్రతి ఇంటికి ధీమా పథకం 5 లక్షల బీమా కల్పిస్తాం.

Updated Date - 2023-10-15T15:04:45+05:30 IST