Ponguleti Srinivasa Reddy: పొంగులేటి నివాసానికి బీజేపీ చేరికల కమిటీ

ABN , First Publish Date - 2023-05-04T14:53:50+05:30 IST

మాజీమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) నివాసానికి బీజేపీ చేరికల కమిటీ వెళ్లింది. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etala Rajender) ఆధ్వర్యంలో..

Ponguleti Srinivasa Reddy: పొంగులేటి నివాసానికి బీజేపీ చేరికల కమిటీ

ఖమ్మం: మాజీమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) నివాసానికి బీజేపీ చేరికల కమిటీ వెళ్లింది. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etala Rajender) ఆధ్వర్యంలో పొంగులేటిని కలిసిన కమిటీ సభ్యులు రఘునందన్‌రావు, కొండా విశ్వేశ్వరరెడ్డి, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి కలిశారు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కమిటీ సభ్యులi లంచ్‌ మీటింగ్ నిర్వహించారు. అంతకుముందు పొంగులేటి నివాసానికి మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) వచ్చారు. ఇప్పటికే పొంగులేటిని బీజేపీ చేరికల కమిటీ పలుమార్లు కలిసింది. నేడు పొంగులేటి పార్టీ మార్పుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. బీజేపీలో పొంగులేటి చేరడం ఖాయమని ఆయన అనుచరులు స్పష్టం చేస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో పొంగులేటి బీజేపీలో చేరుతారని అంటున్నారు.

కర్ణాటక ఎన్నికల అనంతరం పెద్ద ఎత్తున బహిరంగ సభను ఏర్పాటు చేసి బీజేపీలో చేరుతారని తెలుస్తోంది. పొంగులేటితో పాటు.. మాజీమంత్రి జూపల్లికి కూడా కాషాయ కండువా కప్పేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. పొంగులేటితో బీజేపీ నేతలు కూడా మంతనాలు సాగిస్తుండగా.. ఒక వేళ పొంగులేటి బీజేపీలోకి వెళితే జిల్లాలో మొత్తం సీట్లు తన అనుయాయులకే దక్కే అవకాశం కలుగుతుంది. జిల్లాలో బీజేపీకి బలమైన అభ్యర్థులు లేకపోవడం, సంస్థాగతంగా కొంత బలహీనంగా ఉండడం తదితర కారణాలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ అధిష్ఠానం కూడా పొంగులేటిని పార్టీలోకి చేర్చుకుని.. ఉమ్మడిజిల్లాతో పాటు ఇతర జిల్లాల్లోనూ బలపడేలా వ్యూహాలు రచిస్తోంది. ఇతర చోట్ల కూడా ఆయన కోరిన వారికి టికెట్లు బీజేపీ ఇచ్చే అవకాశం లేకపోలేదు.

Updated Date - 2023-05-04T14:53:50+05:30 IST