BJP: ఎన్నికల వేళ బీజేపీకి షాక్.. మాజీ కార్పొరేటర్ రాజీనామా
ABN , First Publish Date - 2023-11-21T10:42:43+05:30 IST
బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు, మాజీ కార్పొరేటర్ జి.అరుణాజయేందర్(Former corporator G. Arunajayender)

చిక్కడపల్లి(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు, మాజీ కార్పొరేటర్ జి.అరుణాజయేందర్(Former corporator G. Arunajayender) ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి పంపించినట్లు ఆమె పేర్కొన్నారు. తనతోపాటు దాదాపు 100 మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు బీజేపీకి రాజీనామా చేశారని ఆమె వివరించారు. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం ఆమె గాంధీనగర్ డివిజన్ ఎస్ఆర్టి కాలనీలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. తనకు పార్టీలో తగిన గౌరవం లేకుండా పోయిందని వాపోయారు. సమావేశంలో జి.జయేందర్‌బాబు, జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్కె శ్రీనివాస్ ముదిరాజ్, శ్రీనాథ్, శిశుకుమార్ పాల్గొన్నారు.