Arguments on Bairi Naresh bail petition are complete bbr

ABN , First Publish Date - 2023-01-23T19:06:15+05:30 IST

బైరి నరేష్ (Bairi Naresh) బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టు (High Court)లో వాదనలు ముగిశాయి. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది.

Arguments on Bairi Naresh bail petition are complete bbr

హైదరాబాద్: బైరి నరేష్ (Bairi Naresh) బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టు (High Court)లో వాదనలు ముగిశాయి. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది. హైకోర్టులో నరేష్ భార్య సుజాత బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే నరేష్‌ను చర్లపల్లి జైలు (Cherlapally Jail) నుంచి మరో జైలుకు మార్చాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. చర్లపల్లి జైల్‌లో నరేష్‌ను చిత్రహింసలు పెడుతున్నారని కోర్టు దృష్టికి పిటిషనర్ తెచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా నరేష్‌పై కేసులు నమోదయ్యాయి. అందుకే చర్లపల్లి జైలులో ఉంచామని కోర్టుకు లాయర్ తెలిపారు.

గతేడాది నవంబర్ 19న వికారాబాద్‌ జిల్లా (Vikarabad District) కొడంగల్‌ మండలం రావుల్‌పల్లి గ్రామంలో అంబేడ్కర్‌ జాతర, విగ్రహావిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బైరి నరేష్ అయ్యప్ప స్వామిపై.. శివకేశవులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై తెలుగు రాష్ట్రాల్లో అయ్యప్ప స్వామి భక్తులు, హిందూ సంఘాలు ఆందోళన చేపట్టాయి. పలు పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. కొడంగల్‌ పోలీసులు బైరి నరేష్‌తో పాటు.. అంబేడ్కర్‌ జాతర కార్యక్రమ నిర్వాహకుడు డోలు హన్మంతును కూడా అరెస్టు చేశారు. వీరిద్దరిపై భారత శిక్షా స్మృతి(ఐపీసీ)లోని 153(ఏ), 295(ఏ), 505(2) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వికారాబాద్‌ జిల్లా నవాబ్‌పేట, కరీంగనగర్‌ జిల్లా జమ్మికుంట ఠాణాల్లోనూ కేసులు నమోదయ్యాయి.

Updated Date - 2023-01-23T19:06:16+05:30 IST