ఎమ్మెల్యేల నిర్ణయం మేరకే సీఎం
ABN , First Publish Date - 2023-11-21T03:29:18+05:30 IST
ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయం.

ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయం. కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్థులు చాలా మంది ఉన్నారు. ఎవరైనా సీఎం పదవిని ఆశించవచ్చు. కానీ, ఎమ్మెల్యేలుగా గెలిచిన వారి అభీష్టం మేరకే నిర్ణయం ఉంటుంది. అధిష్ఠానం వారి నిర్ణయానికే మొగ్గు చూపుతుంది. కర్ణాటకలోనూ ఇలాగే జరిగింది. డీకే శివకుమార్ కూడా ఆ నిర్ణయాన్ని గౌరవించారు.
- కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి
ఖమ్మం - ఆంధ్రజ్యోతి