Share News

Congress vs BRS: కాంగ్రెస్సా.. కారా?.. రంగంలోకి దిగిన బెట్టింగ్‌ బంగార్రాజులు

ABN , First Publish Date - 2023-11-21T03:35:33+05:30 IST

గజ్వేల్‌ బరిలో ఈటలపై కేసీఆర్‌ పైచేయి సాధిస్తారా? తుమ్మల వర్సెస్‌ పువ్వాడ.. ఇద్దరిలో విజయం ఎవరిది?. ఇలా పార్టీల విజయాలపైౖనే కాదు, కీలక అభ్యర్థుల గెలుపోటములపై ఆసక్తి తెలంగాణ ప్రజల్లోనే కాదు.. ఆంధ్ర ప్రజల్లో కూడా ఉంది! ఎంతంటే.. పార్టీలు, అభ్యర్థుల గెలుపుపై ‘కాయ్‌ రాజా కాయ్‌’ అంటూ పందేలు వేసేంత! డబ్బుతోపాటు.. ఇళ్లు, పొలాలు సైతం పణంగా పెట్టేంతగా సిద్ధపడుతున్నాడు.

Congress vs BRS: కాంగ్రెస్సా.. కారా?.. రంగంలోకి దిగిన బెట్టింగ్‌ బంగార్రాజులు

  • కాయ్‌ రాజా కాయ్‌తెలంగాణ ఎన్నికలపై ఏపీలో జోరుగా పందేలు

  • రంగంలోకి దిగిన బెట్టింగ్‌ బంగార్రాజులు.. అధికారంలోకి వచ్చేదెవరనే దానిపై బెట్టింగ్స్‌

  • గత ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సపై ఎక్కువగా పందేలు.. ఈసారి బెట్టింగ్‌లు కాంగ్రె్‌సకు అనుకూలం!

  • ఇళ్లు, పొలాలూ పణంగా పెడుతున్న వైనం

తెలంగాణలో గెలిచేది కాంగ్రెస్సా? బీజేపీనా? బీఆర్‌ఎస్సా?

కామారెడ్డిలో కేసీఆర్‌ నెగ్గుకొస్తారా? లేక రేవంత్‌ సంచలనం

సృష్టిస్తారా? గజ్వేల్‌ బరిలో ఈటలపై కేసీఆర్‌ పైచేయి సాధిస్తారా? తుమ్మల వర్సెస్‌ పువ్వాడ.. ఇద్దరిలో విజయం ఎవరిది?

..ఇలా పార్టీల విజయాలపైౖనే కాదు, కీలక అభ్యర్థుల

గెలుపోటములపై ఆసక్తి తెలంగాణ ప్రజల్లోనే కాదు.. ఆంధ్ర ప్రజల్లో కూడా ఉంది! ఎంతంటే.. పార్టీలు,

అభ్యర్థుల గెలుపుపై ‘కాయ్‌ రాజా కాయ్‌’ అంటూ పందేలు వేసేంత! డబ్బుతోపాటు.. ఇళ్లు, పొలాలు

సైతం పణంగా పెట్టేంత!!

పోలింగ్‌ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీలు, అభ్యర్థుల ప్రచారమే కాదు.. పందెం రాయుళ్ల బెట్టింగ్‌ దందా కూడా జోరందుకుంది. విశేషమేంటంటే.. తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఇక్కడి కంటే పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్కువగా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే అక్కడి బెట్టింగ్‌ బంగార్రాజులు రంగంలోకి దిగారు. ప్రధాన పార్టీల గెలుపోటములపై జోరుగా పందేలు కాస్తున్నారు. పార్టీలతో పాటు కీలక నేతల జయాపజయాలపై కూడా పందేలు కాస్తున్నారు. 2018 తెలంగాణ ఎన్నికల సమయంలోనూ ఏపీలో ఇలాగే జోరుగా పందేలు కాశారు. సాధారణంగా బెట్టింగ్స్‌.. సర్వేలపై ఆధారపడి ఉంటాయి. అందుకే.. ఇప్పటి దాకా వచ్చిన సర్వేలు ఎన్ని? అందులో ఏ పార్టీ గెలుపు అవకాశాలు ఎంత? ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయ్‌? అనే అంశాలను పందెంరాయుళ్లు పరిగణనలోకి తీసుకుంటున్నారు. అలాగే సర్వేలు చేసిన సంస్థల విశ్వసనీయత ఎంత? గతంలో అవి చేసిన సర్వేల వాస్తవిక ఫలితాలు ఎలా వచ్చాయి? అన్న విషయాలను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆ వివరాల ఆధారంగానే పందేలు కాస్తున్నారు.

అలాగే రాజకీయ నేతలతో టచ్‌లో ఉండే సర్వే సంస్థలను కొందరు స్వయంగా కలుస్తున్నారు. కచ్చితంగా గెలిచే పార్టీ ఏంటో ఒకటికి రెండుసార్లు అంచనాలు సరిచూసుకుంటున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను బేరీజు వేసుకోవడానికి తెలంగాణలో ఉన్న తమ పరిచయస్తులు, స్నేహితులు, బంధువులకు ఫోన్లు చేస్తున్నారు. ప్రజల మూడ్‌ ఎలా ఉంది? ఎటువైపు గాలి వీస్తోందో ఆరా తీస్తున్నారు. సోషల్‌మీడియాలో ఏ పార్టీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది? ఏ పార్టీకి సంబంధించిన అంశాలు ఎక్కువగా వైరల్‌ అవుతున్నాయో కూడా తెలుసుకుంటున్నారు. ఎందుకంటే.. సోషల్‌ మీడియాలో ఒక పార్టీకి వ్యతిరేకంగా ఉన్న పోస్టులు ఎక్కువగా వైరల్‌ అవుతున్నాయంటే దాని ప్రత్యర్థి పార్టీకి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఒక బెట్టింగ్‌రాయు డు విశ్లేషించాడు.


కాంగ్రెస్‌వైపే..

గత ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌, టీడీపీ పొత్తుపెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే.. కేసీఆర్‌ తెలంగాణ సెంటిమెంట్‌ను రగల్చడంతో కూటమి విజయావకాశాలు సన్నగిల్లాయి. దీంతో 2018లో చాలామంది టీఆర్‌ఎస్‌ (బీఆర్‌ఎస్‌) గెలుపుపై పందేలు కాశారు. అయితే.. ఈసారి కాంగ్రెస్‌ గెలుస్తుందంటూ పందేలు కాసేవాళ్ల సంఖ్య పెరిగిందని విజయవాడకు చెందిన ఒక పందెంరాయుడు చెప్పాడు. పదిమందిలో ఏడుగురు కాంగ్రెస్‌ గెలుస్తుందని పందేలు కాస్తుండగా.. బీఆర్‌ఎస్‌ విజయంపై బెట్టింగ్‌ పెట్టేవారి సంఖ్య గతంతో పొల్చుకుంటే తక్కువగా ఉందని అంటున్నారు. బీఆర్‌ఎస్‌ గెలుపుపై వైసీపీ వారే ఎక్కువ నమ్మకంతో ఉన్నారని అంటున్నారు.

సిండికేట్‌గా మారి...

ఈ ఎన్నికల్లో విజయాపజయాలపై కొందరు వ్యక్తిగత స్థాయిలో పందేలు కాస్తుండగా.. మరికొందరు సిండికేట్‌గా మారి పందేలు కడుతున్నట్టు సమాచారం. అంటే.. అందరూ తాము పణంగా పెట్టాలనుకుంటున్న సొమ్మును సిండికేట్‌లో పెడతారు. గెలిస్తే అందులో వారి వాటా ఎంతో అంత వస్తుం ది. పోతే మొత్తం పోతుంది. వ్యక్తిగతంగా అయినా, సిండికేట్‌ ద్వారా అయినా.. చాలా మంది రూ.లక్షలు, కోట్లల్లో పందేలు కాస్తున్నారు. కొందరైతే.. వ్యవసాయ భూములు, ఇళ్లను కూడా పందెంగా పెడుతున్నట్టు సమాచారం.

Updated Date - 2023-11-21T11:43:17+05:30 IST