విద్యుత్ సమస్య పరిష్కరించాలని రాస్తారోకో
ABN , First Publish Date - 2023-07-09T22:34:32+05:30 IST
ఇందన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యను పరిష్కరిం చడంతోపాటు మినీ సబ్‌స్టేషన్ ఏర్పాటు చేయాలని ఆదివారం ఇందన్‌పల్లి గ్రామస్తులు మండల కేంద్రంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలో రాస్తారోకో నిర్వహించారు.
జన్నారం, జూలై 9: ఇందన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యను పరిష్కరిం చడంతోపాటు మినీ సబ్‌స్టేషన్ ఏర్పాటు చేయాలని ఆదివారం ఇందన్‌పల్లి గ్రామస్తులు మండల కేంద్రంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలో రాస్తారోకో నిర్వహించారు. గ్రామస్తులు మాట్లాడుతూ లోఓల్టేజీ సమస్య తీవ్రంగా ఉందని, దీంతో ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. వెంటనే విద్యుత్ సమస్యను పరిష్కరించడంతోపాటు మినీ సబ్‌స్టేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రజలతో మాట్లాడారు. అయినా వినకపోవడంతో ట్రాన్స్‌కో సబ్ ఇంజనీర్ అజయ్‌ను పిలిపించడంతో ఆయన ప్రజలతో మాట్లాడారు. సమస్యను ఈ నెల 20వ తేదీలోగా పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. రాస్తారోకోలో గ్రామస్తులు, యువకులు, రైతులు పాల్గొన్నారు.