సమస్యల పరిష్కారానికి కృషి

ABN , First Publish Date - 2023-08-22T22:18:49+05:30 IST

ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను పరిశీలించి సమస్యల పరిష్కానికి కృషి చేస్తామని అదనపు కలెక్టర్‌ దాసరి వేణు అన్నారు.

సమస్యల పరిష్కారానికి కృషి
ర్జీలను స్వీకరిస్తున్న అదనపు కలెక్టర్‌ దాసరి వేణు

ఆసిఫాబాద్‌, ఆగస్టు 22: ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను పరిశీలించి సమస్యల పరిష్కానికి కృషి చేస్తామని అదనపు కలెక్టర్‌ దాసరి వేణు అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ భవన సమావేశ మందరంలో మంగళవారం అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఆసిఫాబాద్‌ మండలం జన్కాపూర్‌ గ్రామానికి చెందిన బొల్లి నాగరాజు డిగ్రీ వరకు చదివానని, రోజు వార కూలిగా పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాని ఉపాధి కల్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశాడు. ఆసిఫాబాద్‌ మండలం రాజంపేటకు చెందిన తిరుసుల్ల శైలజ తాను కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నానని, తనకు ఇంటి నివాస స్థలం ఇప్పించాలని అర్జీ సమర్పించింది. కాగజ్‌నగర్‌ పట్టణానికి చెందిన శంకరయ్య తన రెబ్బెన మండలం నేర్పెల్లి గ్రామ శివారులో ఉన్న వ్యవసాయ భూమిలో విద్యుత్‌ స్తంభం విరిగి తీగలు వేలాడుతున్నాయని, వాటి ని తీగలను తొలగించాలని దరఖాస్తు అందజేశాడు. కాగజ్‌నగర్‌ మండలం బారెగూడకు చెందిన రైతులు తమ వ్యవసాయ భూముల వద్ద ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోయిందని, మరమ్మతులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. తిర్యాణి మండలం మందగూడ గ్రామానికి చెందిన తుంరం కవిత, జైనూరు మండలం షేక్‌గూడకు చెందిన ఆత్రం ఇస్రు, సోమురావు తమకు సొంత ఇంటి స్థలం ఉందని ఇల్లు నిర్మించుకునేందుకు గృహలక్ష్మి పథకం కింద ఆర్థిక సహాయం అందజేయాలని వేర్వేరుగా దరఖాస్తులు అందజేశారు. కాగజ్‌నగర్‌ పట్టణంలో ఇంద్రమార్కెట్‌ ప్రాంతానికి చెందిన ముసరీఫ్‌ హుస్సేన్‌ తాను అద్దె ఇంట్లో నివసిస్తున్నానని, తనకు ఇంటి స్థలం లేదా డబుల్‌ బెడ్‌ రూం ఇల్లు ఇప్పించాలని దరఖాస్తు అందజేశాడు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన దర ఖాస్తులను త్వరిగతిన పరిష్కరించేందుకు అధికారుల సమన్వయంతో కృషి చేస్తామని తెలిపారు.

Updated Date - 2023-08-22T22:18:49+05:30 IST