ఆరోగ్య మహిళా కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2023-05-02T22:08:03+05:30 IST

మహిళల ఆరోగ్యం కోసం ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్య మహిళ కేంద్రాల ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ పేర్కొన్నారు. మంగళవారం హమాలీవాడ బస్తీ దవాఖానాలో ఏర్పాటు చేసిన ఆరోగ్య మహిళ కేంద్రాన్ని తనిఖీ చేశారు.

ఆరోగ్య మహిళా కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

మంచిర్యాల కలెక్టరేట్‌, మే 2: మహిళల ఆరోగ్యం కోసం ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్య మహిళ కేంద్రాల ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ పేర్కొన్నారు. మంగళవారం హమాలీవాడ బస్తీ దవాఖానాలో ఏర్పాటు చేసిన ఆరోగ్య మహిళ కేంద్రాన్ని తనిఖీ చేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో నాలుగు ఆరోగ్య మహిళ కేంద్రాలను ప్రభు త్వం ఏర్పాటు చేసిందన్నారు. కేంద్రంలో సేవలను ఉదయం 9 గంటలకే ప్రారంభించాలని, సమయ పాలన పాటించాలని సిబ్బందికి సూచించారు. ప్రతీ కేంద్రంలో 60 నుంచి 70 మంది మహిళలను పరీ క్షించాలని, కేంద్రాలపై ప్రజలకు అవగాహన కల్పిం చాలన్నారు. మంగళవారం నాలుగు కేంద్రాల్లో 247 మంది మహిళలను పరీక్షించి 9 మందిని మెరుగైన సేవల కోసం సిఫారసు చేశారని కలెక్టర్‌ తెలిపారు. ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ నీరజ, వైద్యులు వైష్ణవి, స్వరూప, వందన, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.

బెల్లంపల్లిరూరల్‌: ఆరోగ్య మహిళ కేంద్రాలను మ హిళలు సద్వినియోగం చేసుకోవాలని డీఎంహెచ్‌వో సుబ్బారాయుడు అన్నారు. తాళ్లగురిజాల పీహెచ్‌సీ లో ఏర్పాటు చేసిన ఆరోగ్య మహిళ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. కేంద్రానికి వచ్చిన మహిళల ఆరోగ్య పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ ప్రతీ మంగళవారం మహిళ లకు 8 రకాల వ్యాధులకు వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతీ ఒక్కరి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. డీఎస్‌వో డాక్టర్‌ ఫ యాజ్‌, పీహెచ్‌సీ వైద్యాధికారి అనీష్‌, డాక్టర్‌ ఎవాం జలిన్‌, హెచ్‌ఈవో సమ్మయ్య, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-05-02T22:08:03+05:30 IST