మహిళలు పురుషులతో సమానంగా పోటీపడాలి
ABN , First Publish Date - 2023-03-05T23:06:35+05:30 IST
ఆసిఫాబాద్, మార్చి 5: మహిళలు పురు షులతో సమానంగా పోటీపడాలని జడ్పీ చైర్‌పర్సన్ కోవలక్ష్మి అన్నారు. జిల్లాకేంద్రంలో వైద్యఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మహిళా దినో త్సవాన్ని పురస్కరించుకొని ‘ఆరోగ్య వంత మైన మహిళా -ఆరోగ్యవంతమైన ఇండియా’ అనే నినాదంతో నిర్వహించిన సైకిల్ ర్యాలీని డీఎంహెచ్‌వో రామకృష్ణతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.
- జడ్పీ చైర్‌పర్సన్ కోవ లక్ష్మి
ఆసిఫాబాద్, మార్చి 5: మహిళలు పురు షులతో సమానంగా పోటీపడాలని జడ్పీ చైర్‌పర్సన్ కోవలక్ష్మి అన్నారు. జిల్లాకేంద్రంలో వైద్యఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మహిళా దినో త్సవాన్ని పురస్కరించుకొని ‘ఆరోగ్య వంత మైన మహిళా -ఆరోగ్యవంతమైన ఇండియా’ అనే నినాదంతో నిర్వహించిన సైకిల్ ర్యాలీని డీఎంహెచ్‌వో రామకృష్ణతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంతో పోలిస్తే మెరు గైనప్పటకీ మహిళలు మరింత ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం డీఎంహెచ్‌వో రామకృష్ణ మాట్లాడుతూ సమాజంలో మహిళలు ఆరోగ్యంపట్ల శ్రద్ధ తీసుకోవాలన్నారు. దీనికోసం ఏఎన్‌ఎం, ఆశావర్కర్లు పనిచేయాలన్నారు. వైద్య శాఖలో పనిచేసే మహిళలకు అన్నివిధాల అండగా ఉంటామన్నారు. అంతకుముందు మహిళా దినోత్స వాన్ని పురస్కరించుకుని తమకు ఉత్తమ అవార్డు అందజేయాలని ఏఎన్‌ఎం, ఆశావర్కర్లు జడ్పీ చైర్ పర్సన్‌కు వినతిపత్రం అందజేశారు.కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో సుధాకర్‌నాయక్, వైద్య సిబ్బంది, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు విద్యార్థులు పాల్గొన్నారు.
అంబేద్కర్ అడుగు జాడల్లో నడవాలి
రెబ్బెన(ఆసిఫాబాద్‌రూరల్): అంబేద్కర్ అడుగు జాడల్లో నడవాలని జడ్పీ చైర్‌పర్సన్ కోవ లక్ష్మి అన్నారు. ఆదివారం రెబ్బెనమండలం నారాయణ పూర్ గ్రామంలో అంబేద్కర్‌విగ్రహాన్ని ఆమె ఆవి ష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంబే ద్కర్ రచించిన రాజ్యాంగం ఫలితంగా అణగా రిన వర్గాలకు అభివృద్ధిఫలాలు అందుతున్నాయ న్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్‌రావు, నాయకులు పాల్గొన్నారు.