గెలుపైనా ఓటమైనా ప్రజలతోనే
ABN , First Publish Date - 2023-12-04T22:21:45+05:30 IST
గెలుపైనా ఓటమైనా ప్రజలతోనేనని బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాధ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లాడుతూ మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రజలు ఆశీర్వదించి తనకు 40 వేల ఓట్లు వేసి రెండో స్ధానంలో నిలి పారని వారికి రుణపడి ఉంటానన్నారు.
ఏసీసీ, డిసెంబరు 4 : గెలుపైనా ఓటమైనా ప్రజలతోనేనని బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాధ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లాడుతూ మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రజలు ఆశీర్వదించి తనకు 40 వేల ఓట్లు వేసి రెండో స్ధానంలో నిలి పారని వారికి రుణపడి ఉంటానన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసా వహిస్తానని, వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. కార్యకర్తల కృషి వల్లనే బీజేపీకి 40 వేల ఓట్లు వచ్చాయన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ప్రేంసాగర్‌రావుకు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ హామీలను నెరవేర్చాలన్నారు. నాయకులు హరికృష్ణ, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.