ఎంత కాలం నిరీక్షణ

ABN , First Publish Date - 2023-03-18T22:38:26+05:30 IST

ప్రభుత్వ స్థలాల ను ఆక్రమించి ఇళ్లు నిర్మించుకున్న వారికి హక్కులు కల్పిస్తామని ప్రకటించిన తెలంగాణ సర్కారు అందుకు దరాఖాస్తు చేసుకునేందుకు గడువు మీద గడువు పెంచు కుంటూ వెళ్తుండడంతో నిరీక్షణ తప్పడం లేదు.

ఎంత కాలం నిరీక్షణ
లోగో

- నెల రోజులు వ్యవధి పెంచుతూ జీవో జారీ

- కటాఫ్‌ తేదీల్లోనూ మార్పులు

- సింగరేణిలో మూడు నెలల గడువు

మంచిర్యాల, మార్చి 18(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ స్థలాల ను ఆక్రమించి ఇళ్లు నిర్మించుకున్న వారికి హక్కులు కల్పిస్తామని ప్రకటించిన తెలంగాణ సర్కారు అందుకు దరాఖాస్తు చేసుకునేందుకు గడువు మీద గడువు పెంచు కుంటూ వెళ్తుండడంతో నిరీక్షణ తప్పడం లేదు. స్థ్థలాలను క్రమబద్ధీకరించుకోవడం ద్వారా పలు రకాలుగా ప్రయోజ నాలు పొందే అవకాశం ఉండడంతో దరఖాస్తు చేసుకున్న వారంతా పట్టాల కోసం ఎదురు చూస్తున్నారు. దరఖా స్తుదారులు నివసిస్తున్న ఇళ్ల సర్వే పూర్తయి ఏడాది గడుస్తున్నా ఇంతకాలం క్రమబద్ధీకరణకు అడుగులు ముందుకు పడలేదు. సర్వే పూర్తయిన తరువాత కేవలం నె ల రోజులలోపే క్రమబద్ధీకరణ చేస్తామని చెప్పిన అధికారు లు మళ్లీ ఆ ప్రస్తావన తేకపోవడంతో దరఖాస్తుదారులు కొంత అయోమయానికి గురవుతున్నారు. ప్రస్తుతం సర్వే ప్రక్రియ పూర్తయినందున ప్రభుత్వం జీవో 58,59 కింద క్రమబద్ధీకరణ చేపడతామని ఇటీవల ప్రకటించింది. దీంతో ఆశలు చిగురిస్తున్న సమయంలో దరఖాస్తు గడువును మళ్లీ పెంచుతూ తాజాగా జీవో జారీ చేసింది. దీంతో స్థలా ల క్రమబద్ధీకరణకు అసలు మోక్షం లభిస్తుందో, లేదేమో నన్న అయోమయం దరఖాస్తుదారుల్లో నెలకొంది.

ఇళ్లు, ఇతర కట్టడాలు..

ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు, ఇతర కట్టడాలు నిర్మించుకున్న వారికి అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. ఇందులో భాగంగా 2014 జూన్‌ 2 నాటికి ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని నిర్మా ణాలు చేపట్టిన వారందరూ ఆధార్‌ కార్డు, నల్లా పన్ను, కరెంటు బిల్లులో ఏదైనా ఒకదానితో పాటు స్థలం తమ ఆధీనంలో ఉన్నట్లు చూపించే ఆధారాలతో దరఖాస్తు చేసుకుంటే క్రమబద్ధీకరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు గతంలో జారీ చేసిన 58, 59 జీవోలకు అను బంధంగా గత సంవత్సరం ఫిబ్రవరిలో జీవో 14ను విడు దల చేసింది. 125 గజాల విస్తీర్ణంలోపు నిర్మాణాలు చేసుకున్న వారికి జీవో నంబరు 58 కింద ఉచితంగా క్రమబద్ధీకరిస్తారు. 250 చదరపు గజాల లోపు ఉన్న వాటికి మార్కె ట్‌ విలువలో 50 శాతం, 250-500 చదరపు గజాలలోని ఇళ్లకు 75 శాతం, అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించిన కట్టడాలకు 100 శాతం రుసుము చెల్లించాలని ప్రకటిం చింది. ఈ మేరకు గత ఏడాది ఫిబ్రవరి 21 నుంచి మార్చి 31 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించింది.

పేదల నుంచి స్పందన తక్కువే..

ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన ఇళ్లను క్రమబద్ధీకరిస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ పేదలు ముందుకు రాకపోక పోవడం గమనార్హం. క్రమబద్ధీకరణ కోసం గతంలో విడు దల చేసిన 58,59 జీవోలతోపాటు తాజాగా జారీ చేసిన జీవో 14పై పేద ప్రజలకు అవగాహన లేకపోవడంతో ప్రజ లు ఆసక్తి చూపడం లేదు. తొలుత విడుదల చేసిన 58,59 జీవోలకు సంబంధించిన దరఖాస్తులు పెద్ద మొత్తంలో పెండింగులో ఉండడం, ప్రజలు ముందుకు రాకపోవడానికి కారణంగా తెలుస్తోంది. అప్పట్లో నిర్ణీత ఫీజును సైతం ప్రభుత్వం సూచించిన విధంగా విడుతల వారీగా మీ సేవల ద్వారా చెల్లించారు. నెలు గడుస్తున్నా దరఖాస్తుదా రులకు క్రమబద్ధీకరణ చేయకపోగా, డబ్బులు కూడా తిరిగి ఇవ్వకపోవడంతో ప్రజల్లో అనాసక్తి నెలకొంది. జీవో 14 సైతం అలాగే ఉంటుందనే భయంతో ప్రజలు ముందుకు రాలేదని తెలుస్తోంది.

జిల్లాలో దరఖాస్తులు ఇలా..

ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన ఇళ్లకు క్రమబద్ధీకరణకు మంచిర్యాల జిల్లాలో మొత్తం 2,827 దరఖాస్తులు వచ్చా యి. ఒక్క నస్పూర్‌ మున్సిపాలిటీ పరిధిలోనే ఏకంగా 1,075 దరఖాస్తులు అందాయి. నస్పూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబరు 42లో పెద్ద ఎత్తున ప్రభుత్వ, అసైన్డ్‌ భూములు ఉన్నాయి. వాటిలో అధిక శాతం కబ్జాల కు గురయ్యాయి. అక్రమ నిర్మాణాలు, కబ్జాల కారణంగా సుమారు రూ. 50 కోట్లు విలువ చేసే భూములు అన్యా క్రాంతం కాగా ప్రస్తుతం వాటిని క్రమబద్ధీకిరించుకునేందు కు దరఖాస్తులు చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రాథ మికంగా 68 మందిని క్రమబద్ధీకరణకు ఎంపిక చేశారు. జీవో 58 కింద వచ్చిన 16 దరఖాస్తులను అర్హతలను బట్టి 59 జీవో కిందికి మార్పు చేశారు. దరఖాస్తుదారుల్లో 10 గుంటలు మొదలు ఎకరాల కొద్దీ చేజిక్కించుకున్న బడా బాబులే అధికంగా ఉన్నారు. 500 పైబడి గజాల్లో నిర్మాణాలు చేపట్టిన వారికి 100 శాతం మార్కెట్‌ ఫీజు వసూలు చేస్తుండగా, ప్రభుత్వం నిర్ణయం వల్ల అప్పట్లో భూ కబ్జాలకు పాల్పడ్డ వారికి పెద్ద మొత్తంలో కలిసి రా నుంది. మంచిర్యాల డివిజన్‌లో 2,386 దరఖాస్తులు రాగా, బెల్లంపల్లి డివిజన్‌లో 441 మంది దరఖాస్తు చేసుకున్నారు.

తాజాగా జీవో 76 విడుదల..

తెలంగాణ సర్కారు స్థలాల క్రమబద్ధీకరణకు దరఖాస్తు గడువు మరో నెల రోజులపాటు ఏప్రిల్‌ 1 నుంచి 30 వర కు పొడిగిస్తూ తాజాగా ఈ నెల 17న జీవో 76ను విడుదల చేసింది. సింగరేణి ఏరియాలో దరఖాస్తు గడువును మూడు నెలల పాటు పొడిగించింది. ఇందులో భాగంగా క్రమబద్ధీకరణకు వర్తించే కటాఫ్‌ తేదీని గతంలో ప్రకటిం చిన 2014 జూన్‌ 2 నుంచి 2020 జూన్‌ 2 వరకు పొడిగించింది. అంటే 2020 జూన్‌ 2 వరకు ప్రభుత్వ స్థలాల కబ్జాలో ఉన్నవారంతా అర్హులన్నమాట. సర్కారు తాజా నిర్ణయంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత భూములు కబ్జా చేసిన వారికి కూడా ప్రభుత్వం దన్నుగా నిలువనుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. తాజాగా దరఖాస్తు చేసుకునేందుకు గడువు పెంచిన ప్రభుత్వం కటాఫ్‌ తేదీని కూడా సవరించడంపై విమర్శలు వ్యక్తమ వుతున్నాయి. గతంలో జారీ చేసిన జీవో 14కు పేదల నుంచి పెద్దగా స్పందన లేకపోగా, ప్రస్తుతం బడా బాబు లకు మేలు చేకూర్చేందుకే పాత జీవోను మార్చి కటాఫ్‌ తేదీని సవరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలం గాణ ఏర్పడ్డ నాటి నుంచి ఈ ఎనిమిదేళ్ల కాలంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యాయి. అధికార పార్టీ నేతలపై పెద్ద ఎత్తున కబ్జా ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ తాజా నిర్ణయం వల్ల వారందరికీ మేలు జరుగుతుందనే ప్రచారం జోరుగా సాగు తోంది. ఇప్పటికే బడాబాబులు పకడ్బందీ ప్రణాళికలతో ప్రభుత్వ స్థలాలను పెద్ద మొత్తంలో ఆక్రమించుకున్నారని, వారికి సవరణ జీవో ఎంతగానో ఉపయోగపడనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా సింగరేణి ఏరి యాలో భూముల క్రమబద్ధీకరణ గడువు 1 ఏప్రిల్‌ నుంచి జూన్‌ 2 వరకు పొడిగించింది. జూన్‌లో సింగరేణి ‘గుర్తింపు’ ఎన్నికలు ఉన్నందున కార్మికుల నుంచి లబ్ధిపొం దేందుకే అంత గడువు పెంచినట్లు అభిప్రాయాలు వ్యక్తమ వుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు ప్రభు త్వం ఇళ్ల క్రమబద్ధీకరణకు చర్యల పేరిట జీవోలు జారి చేస్తోందని ప్రజల్లో చర్చ మొదలైంది.

Updated Date - 2023-03-18T22:38:26+05:30 IST